BREAKING
ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు మాజీ మంత్రి పువ్వాడ దసరా వేడుకలు డెహ్రాడూన్‌లో దసరా వేడుకల్లో పాల్గొన్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.

గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ

Select Suryaa Now
గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ

ధర్మసాగర్ , మేజర్ న్యూస్,
.బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ముప్పారం గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక పలు వర్గాలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, భవానీ మాలధారులు, కోలాటం బృందాలకు ఆమె కానుకలు అందజేశారు.
గ్రామంలోని 12 వార్డుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు ఇచ్చారు. గ్రామ కమిటీ సభ్యులకు కూడా సర్పంచ్ తన తరఫున నూతన వస్త్రాలు అందించారు. దుర్గా నవరాత్రుల సందర్భంగా 30 మంది కోలాటం కళాకారిణులకు కొత్త చీరలు బహూకరించారు. పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక మాట్లాడుతూ, బతుకమ్మ, దసరా ఉత్సవాల విజయవంతానికి ఉత్సవ కమిటీ అద్భుతంగా కృషి చేసిందని ప్రశంసించారు. తాను గ్రామంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రవీంద్రచారి, ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, ఉత్సవ కమిటీ కన్వీనర్ గొట్టిముక్కుల సురేష్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లక్ష్మి రాజేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ ;కొట్టే పద్మయ్య, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా