BREAKING
న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు...

గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి

Select Suryaa Now
గోదావరి నీటిలో భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి
 
 
ఊమ్మెడ బ్రిడ్జి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
 
సూర్య నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :
 
 గణేష్ నిమజ్జనం సందర్భంగా నందిపేట్ మండలం ఊమ్మెడ బ్రిడ్జి వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య క్షుణ్ణంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గోదావరి నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా భారీ గణేష్ విగ్రహాలను గోదావరి నీటిలో నిమజ్జనం చేసే సమయంలో నిర్వాహకులు , భక్తులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.భారీ విగ్రహాల నిమజ్జనం సమయంలో ఎవరూ ప్రమాదకరంగా నీటిలోకి వెళ్లకుండా చూడాలని , పోలీస్ సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నిమజ్జన ప్రాంతంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు , సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
అదేవిధంగా నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకలు , ట్రాఫిక్ నియంత్రణ , పార్కింగ్ మరియు ప్రజల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు.గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా పోలీస్ శాఖకు ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు సహకరించాలని పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, కోరారు.ఈ సందర్భంలో భారీ వినాయకుల నిమజ్జనం కోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ (అడ్మిన్)  ఎన్. శుభం ప్రకాష్ , సిటిసి ఎసిపి  రాజశేఖర్ , ఆర్మూర్ రూరల్ సీఐ  జాన్ రెడ్డి , నందిపేట్ ఎస్సై  ఎన్. వినయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.