BREAKING
కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు ఢిల్లీలో కాలుష్యం తీవ్రత దృష్ట్యా ఎయిర్ ప్యూరిఫయర్లకు ఐదు రెట్లు పెరిగిన డిమాండ్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా నూతన పెన్షన్ పత్రాల పంపిణీ భారతీయ సంస్కృతి, సామాజిక సమైక్యతకు ఛత్‌ పూజ ప్రతీక: ఎంపీ ఈటల రాజేందర్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడి: హమాస్ కమాండర్ హతం ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.....

Select Suryaa Now
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.....

మద్దూరు .....మద్దూరు మండలంలోని నర్సాయపల్లి, గాగిల్లాపూర్, రేబర్తి గ్రామాలలో సర్పంచ్ లు శనిగారం సత్యనారాయణ, ఇట్టబోయిన కనక చంద్రం, నీరటి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో శనివారం బాలల దినోత్సవం పురస్కరించుకొని గ్రామసభలు నిర్వహించి బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని ఉన్నారు. అనంతరం పాఠశాలల భాగస్వామ్యం బాల్యవివాహాల నిర్మూలన బాల కార్మిక నిర్మూలన హింస బాలల పరిరక్షణ ఆరోగ్యం, ఉపాధ్యాయుల పట్ల తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలని తదితర అంశాలపై బాలలకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా చూడాలని భోజన నాణ్యత విద్యార్థులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రేబర్తి గ్రామ సర్పంచ్ నీరటి శ్రీనివాస్ సూచించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారి అభిప్రాయాలను సర్పంచ్లు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తల్లిదండ్రులకు గురువులకు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్, ఉప సర్పంచ్ లు గొడుగు బాలరాజు, బియ్య రమేష్, పాఠశాల హెడ్ మాస్టర్ లు హరిప్రసాద్, స్కూల్ టీచర్లు అంగన్వాడీ టీచర్లు సిఏలు, ఆశ వర్కర్లు మా ఆదర్శ పాఠశాల చైర్మన్ లు, పలువురు వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.