BREAKING
గ్రామాల అభివృద్ధిపై మంత్రి అనగాని ప్రత్యేక ముద్ర! కూటమి అభ్యర్థుల విజయంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు.. సీసీ రోడ్లు, మంచినీరు, సంక్షేమమే ప్రాధాన్యం ప్రతి గ్రామం ప్రగతి బాట పట్టాలన్నదే మంత్రి అనగాని సంకల్పం.. మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చొరవ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి - సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం

ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్(అక్టోబర్‌ 6):
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి పార్టీల నాయకులు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు జాదవ్‌ ధారాసింగ్‌ నాయక్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీకి కాంగ్రెస్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఎన్‌టీఆర్‌ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ బీజేఆర్‌ చౌరస్తా మీదుగా అంబేద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. మార్గమధ్యంలో నాయకులు, కార్యకర్తలు ‘ఓటు బచావో–దేశ్‌ బచావో’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ అన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, తొలగింపులకు సంబంధించి ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని, అభ్యంతరాలు తెలిపేందుకు, అవసరమైన ఆధారాలు సమర్పించేందుకు తగిన అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.కొత్తగా అర్హత పొందిన యువత ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, ఇప్పటికే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని ధారాసింగ్‌ నాయక్‌ స్పష్టం చేశారు.ర్యాలీలో పరిగి ఎమ్మెల్యే, ఎస్‌ఐఆర్‌ శిక్షణ కమిటీ చైర్మన్‌ టి. రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, సీపీఐ నాయకుడు పీర్‌ మహమ్మద్‌, సీపీఐ(ఎం) నాయకుడు మహిపాల్‌, సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు మహేందర్‌, టీజేఎస్‌ నాయకుడు సోమశేఖర్‌, కొడంగల్‌ ఎస్‌ఐఆర్‌ అసెంబ్లీ కోఆర్డినేటర్‌ మాణిక్యం మల్లేష్‌ యాదవ్‌తో పాటు వివిధ పార్టీల జిల్లా నాయకులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కుమ్మరి రాఘవేందర్, వికారాబాద్ జిల్లా ప్రతినిధి.