BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు పంటల మార్పిడిపై అవగాహన

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు పంటల మార్పిడిపై అవగాహన

కొల్చారం ..ఎల్‌నినో ప్రభావాల నేపథ్యంలో పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించేందుకు కొల్చారం మండలంలోని అంసాన్‌పల్లి, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న వర్షాకాల పరిస్థితులు, భూగర్భ జలమట్టం తగ్గుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు చర్యలపై రైతులకు అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి మాట్లాడుతూ.. భూగర్భ జలమట్టం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా మొక్కజొన్న, జొన్న, పెసర, మినుము, అలసంద, పొద్దుతిరుగుడు, వేరుశనగ వంటి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అనుకూలమైన భూములు, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టి దీర్ఘకాలిక ఆదాయం పొందే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారులు రుతుపవనాల రాక, వర్షాల పరిస్థితులు, విత్తనాలు వేసేందుకు అనువైన సమయంపై అవగాహన కల్పించారు. నీటి లభ్యతను బట్టి ఆకుకూరలు, బెండ, గోరుచిక్కుడు వంటి కూరగాయలు సాగు చేయాలని, డ్రిప్ సౌకర్యం ఉన్న రైతులు టమాటా, మిరప, బీరకాయ, కాకరకాయ, సొరకాయ వంటి పంటలను సాగు చేసుకోవచ్చని వివరించారు.
డ్రిప్ ఇరిగేషన్ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరిస్తూ ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, చిన్న, సన్నకారు, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఏపీఓ మాట్లాడుతూ వి.బి.జి. రామ్ జీ పథకం ద్వారా గ్రామాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు చేపట్టే పనులను వివరించారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు గ్రామస్థాయిలో కమ్యూనిటీ సోక్‌పిట్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.