BREAKING
బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం: కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ కాళ్లకల్‌లో 956 గ్రాముల గంజాయి పట్టివేత* సమస్యలపై యువత గళమెత్తాలి : పల్లపు గోవర్ధన్‌ భారత్, శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: వైజాగ్ స్టేడియానికి మ్యాచ్ కేటాయింపు సమాన స్కాలర్షిప్ కోసం డిమాండ్ జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన గీతా విద్యార్థిని పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నల్ల నర్సింహులు ఎంఐ లండన్ హెడ్ కోచ్ పదవికి కీరన్ పొలార్డ్ గుడ్‌బై: నివేదికల వెల్లడి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస, క్విజ్ పోటీలు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస, క్విజ్ పోటీలు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

Select Suryaa Now
ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస, క్విజ్ పోటీలు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

 

సంగారెడ్డి, : భవిష్యత్ ఓటర్లలో ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకైన భాగస్వామ్య స్ఫూర్తిని కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ ఆదేశించారు. నవంబర్ 20వ తేదీలోగా మూడు స్థాయిల్లో పోటీల నిర్వహణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోటీల నిర్వహణ, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంగారెడ్డి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ సంగీత, కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నవంబర్ 2 నుంచి 20వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలల స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించనున్నారు. సంస్థాగత స్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి.. ఇలా మూడు దశల్లో పోటీలు జరగనున్నాయి.

మూడు దశల్లో పోటీల నిర్వహణ

మొదట పాఠశాలలు, కళాశాలల్లో సంస్థాగత స్థాయిలో వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ప్రతి విద్యాసంస్థ నుంచి ప్రతి పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులను అసెంబ్లీ నియోజకవర్గ స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ నిర్వహించే పోటీల్లో ప్రతి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.

పోటీల షెడ్యూల్‌ను ఈ విధంగా ఖరారు చేశారు.

  • పాఠశాలలు, కళాశాలల స్థాయి: నవంబర్ 2 నుంచి 7 వరకు.
  • అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి: నవంబర్ 10 నుంచి 13 వరకు.
  • జిల్లా స్థాయి: నవంబర్ 16 నుంచి 18 వరకు.

ఓటు హక్కు ప్రాధాన్యతపై వ్యాస పోటీలు ..వ్యాస రచన పోటీలకు 'ఓటింగ్ ప్రాముఖ్యత', 'శుద్ధమైన ఓటర్ల జాబితా ప్రాముఖ్యత' అనే అంశాలను కేటాయించారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యాసాలు రాయవచ్చని తెలిపారు. ప్రతి స్థాయిలో పోటీల మూల్యాంకనం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేయనున్నారు.జిల్లా స్థాయిలో విజేతల వివరాలు, పోటీల నిర్వహణ, ప్రచార కార్యక్రమాల సమాచారంతో కూడిన సమగ్ర నివేదికను నవంబర్ 25వ తేదీలోగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.జిల్లాలో పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు స్వీప్ నోడల్ అధికారి సమన్వయం, పర్యవేక్షణలో సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు.