అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం
ఆమనగల్లు రంగారెడ్డి:
మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన సుగుణమ్మ వైద్య ఖర్చులకు గురువారం మునిసిపాలిటీ ఐదో వార్డ్ కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకుడు పాపిశెట్టి రాము ఆర్థిక సహాయం అందజేశారు. బాధితురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతూ ఇబ్బందులు పడుతుంది విషయం తెలుసుకున్న కౌన్సిలర్ బాధితురాలని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధితురాలికి ఆర్థిక సహాయం అందజేసిన కౌన్సిలర్ రాముకు పలువురు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రామన్న మిత్రబృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.