BREAKING
బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం: కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ కాళ్లకల్‌లో 956 గ్రాముల గంజాయి పట్టివేత* సమస్యలపై యువత గళమెత్తాలి : పల్లపు గోవర్ధన్‌ భారత్, శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: వైజాగ్ స్టేడియానికి మ్యాచ్ కేటాయింపు సమాన స్కాలర్షిప్ కోసం డిమాండ్ జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన గీతా విద్యార్థిని పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నల్ల నర్సింహులు ఎంఐ లండన్ హెడ్ కోచ్ పదవికి కీరన్ పొలార్డ్ గుడ్‌బై: నివేదికల వెల్లడి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస, క్విజ్ పోటీలు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

కాళ్లకల్‌లో 956 గ్రాముల గంజాయి పట్టివేత*

Select Suryaa Now
కాళ్లకల్‌లో 956 గ్రాముల గంజాయి  పట్టివేత*

lమనోహరాబాద్, ; మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ పరిధిలోని కేఎల్ఆర్ గ్రీన్ వెంచర్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు  నిర్వహించి భారీ మొత్తంలో ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో బీహార్ రాష్ట్రానికి చెందిన జ్యోతిష్ కుమార్ (22) వద్ద 956 గ్రాముల ఎండు గంజాయిని గుర్తించి పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డీటీఎఫ్ సీఐ జె. గోపాల్ వెల్లడించారు.ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రయ్య గౌడ్, సూపరింటెండెంట్ ఎల్. నరసింహారెడ్డి ఆదేశాల మేరకు డీటీఎఫ్ సీఐ జె. గోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కాళ్లకల్‌లోని కేఎల్ఆర్ గ్రీన్ వెంచర్‌లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న జ్యోతిష్ కుమార్‌ను తనిఖీ చేయగా అతని వద్ద 956 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని సీఐ గోపాల్ పేర్కొన్నారు. నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తోందని, ఎక్కడైనా గంజాయి వంటి మాదకద్రవ్యాల సమాచారం అందితే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆయన సూచించారు.పట్టుబడిన జ్యోతిష్ కుమార్‌తో పాటు స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయిని తదుపరి చర్యల నిమిత్తం నర్సాపూర్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయానికి అప్పగించినట్లు అధికారులు వివరించారు.
ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పుండరీకం, వహీద్, స్రవంతి, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తనిఖీలు, నిఘా చర్యలను కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు.