పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నల్ల నర్సింహులు
మన ఆలోచన సాధన సమితి (మాస్) అధ్యక్షుడు కటకం నర్సింగరావు
హైదరాబాద్, మేజర్ న్యూస్:భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్లా ననరసింహులు 34వ వర్ధంతి కార్యక్రమం మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ భూమికోసం భుక్తి, కోసం, వేట్టి చాకిరి విముక్తి కోసం, నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల, పెత్తందారి వ్యవస్థకు, వ్యతిరేకంగా పోరాడిన గొప్ప తెలంగాణ రైతంగ సాయుధ పోరాటయోధులు నల్లా నర్సింహులు 34 వర్ధంతి కార్యక్రమాన్ని మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ చరిత్రలో నల్లా నర్సింహులు గారి ప్రత్యేకమైన స్థానం. 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ రైతంగ సాయుధ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జనగామ ప్రాంతానికి చెందిన ఆయన ఆంధ్ర మహా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని గ్రామీణ ప్రాంతంలో ప్రజలను సంఘటితం చేశారు. నిజాం పాలనలో భూస్వామ్యులు, దేశముక్కుల దోపిడీ,పేద ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు వెట్టి చాకిరి బానిసత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు. రైతులకు భూమిపై హక్కులు కల్పించాలని కష్టపడే ప్రజలకు న్యాయం జరగాలని తన జీవితాన్ని ఉద్యమానికి అంకితం చేశారు. మాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శిపెద్దవూరే బ్రహ్మయ్య మాట్లాడుతూ,ఈ పోరాటంలో ఎన్నోసార్లు అరెస్టులు, జైలు జీవితం,చిత్రహింసలు, ఎదుర్కొన్నారు. మూడుసార్లు ఉరిశిక్షలు విధించబడిన ధైర్యంగా న్యాయ పోరాటం చేశారు. ఆయన పోరాట పట్టిమకు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ప్రజలు ఆయనను తెలంగాణ టైగర్ గా స్మరించుకున్నారు. 1993 నవంబర్ 5 న ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు,నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. నల్లా నర్సింహులు వంటి మహానీయుల జీవిత చరిత్రలను భావితరాలకు పరిచయం చేయడం మనందరి బాధ్యత, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సామాజిక న్యాయం సమానత్వం అనగారిన వర్గాల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దవూరే బ్రహ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నేరెళ్ల దేవేందర్ జి, అమృత మార్కండేయులు,, పెద్దవూరే బ్రహ్మయ్య, కోoపోజ్ నరహర చారి, మారోజు రాజు చారి, శ్రీ గాది కృష్ణయ్య, సామ పృథ్వీరాజ్ ముదిరాజ్, కటకం శ్రీకాంత్, దుర్గం శ్రీనివాస్, దోర్నాల కొండలరావు, కడవేరు చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.