BREAKING
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం పంచతత్వం - ప్రకృతికి నీరాజనం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు ముందు సాధించాల్సిన 5 భారీ రికార్డులు: క్రికెట్ ప్రపంచం ఎదురుచూపులు కర్మన్ఘాట్ అంజన్న హుండీ ఆదాయం బాణాసంచా విక్రయదారులుప్రభుత్వ నిబంధనలు పాటించాలి బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం: కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ

ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ

నిజాంపేట్ మేజర్ న్యూస్ :ప్రగతినగర్‌ జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భూమి పరిరక్షణ కోసం జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్‌ 13న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి పాఠశాల స్థలాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నవంబర్‌ 13వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో భారీ స్కూల్‌ పరిరక్షణ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాల స్థలాన్ని శాశ్వతంగా ప్రభుత్వ ఆధీనంలోనే పరిరక్షించాలని, భూమికి సంబంధించి వస్తున్న ఆక్రమణ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అలాగే పాఠశాలకు అవసరమైన నిధులు, మౌలిక వసతులు, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులను ప్రభుత్వం కల్పించాలని కోరారు. “పాఠశాల భూమిని కాపాడుకుందాం.. విద్యార్థుల భవిష్యత్తును రక్షించుకుందాం” అనే నినాదంతో నిర్వహించే ఈ ర్యాలీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ఆకుల సతీష్‌, వెంకటరామయ్య, మేడా శ్రీనివాస్‌, మల్యాల రమణి, మురళి, తులసిదాస్‌, లోకంనాథం, ఎల్లస్వామితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.