BREAKING
ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదిక విచిత్రమైన నోబాల్ వివాదం: కీపర్ చేసిన చిన్న పొరపాటుకు బౌలర్‌కు శిక్ష.. రూల్స్ ఏం చెబుతున్నాయి? అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం . పరిశోధనలో విమర్శనాత్మక మూల్యాంకనమే కీలకం విదేశీ ఆస్తుల వెల్లడింపుపై ఆదాయపు పన్ను శాఖ సంవాదాత్మక సదస్సు ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదన్న నటి నజ్రియా: సీన్ సినిమా విశేషాలు ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం* సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం పంచతత్వం - ప్రకృతికి నీరాజనం

శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి

Select Suryaa Now
శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన  ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్ మేజర్ న్యూస్ ( సిటీ ప్రతినిధి): మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీలు) నుంచి సరఫరా చేసే శుద్ధి చేసిన నీటి నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుద్ధి చేసిన నీటిని నిర్మాణ రంగం, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర తాగేతర అవసరాలకు విస్తృతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గురువారం నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ ఎస్టీపీలను సందర్శించిన ఆయన.. శుద్ధి చేసిన నీటి నాణ్యత, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లు, సరఫరా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

*నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలి..*
అనంతరం ఖాజాగూడ ఎస్టీపీని సందర్శించిన ఎండీ.. శుద్ధి చేసిన నీరు బయటకు విడుదలయ్యే అవుట్‌లెట్‌ను పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, పునర్వినియోగానికి అనుకూలతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

శుద్ధి చేసిన నీరు పునర్వినియోగానికి నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిరంతరం పరీక్షించాలని ఆదేశించారు. బీవోడీ (BOD), సీవోడీ (COD), టీఎస్ఎస్ (TSS), పీహెచ్ (pH) తదితర నాణ్యత పారామీటర్లను క్రమం తప్పకుండా పరిశీలించి, ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. నీటి శుద్ధి ప్రక్రియలో ప్రతి దశలోనూ ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.

*ట్యాంకర్ల రాకపోకలకు అనువుగా ఫిల్లింగ్ స్టేషన్లను అభివృద్ధి చేయాలి..*
ఎస్టీపీల వద్ద గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ట్యాంకర్లు లోపలికి ప్రవేశించడం, నీటిని నింపుకోవడం, తిరిగి బయటకు వెళ్లడం వంటి ప్రక్రియల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద అంతర్గత రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు, ట్యాంకర్లు సులభంగా రాకపోకలు సాగించేందుకు తగిన స్థలం, మలుపులు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. ఒకేసారి ఎక్కువ ట్యాంకర్లు వచ్చినా ట్రాఫిక్ అంతరాయం లేకుండా, నీటి నింపే ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా మౌలిక సదుపాయాలను కల్పించాలని స్పష్టం చేశారు. ఇతర ఎస్టీపీలకు ఆదర్శంగా నిలిచేలా ఫిల్లింగ్ స్టేషన్లను మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

*ఎస్టీపీల వద్ద ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు..*
ప్రతి ఎస్టీపీ వద్ద శుద్ధి చేసిన నీటి నాణ్యత వివరాలు అందరికీ స్పష్టంగా కనిపించేలా ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఎండీ అధికారులను ఆదేశించారు. నీటి నాణ్యతకు సంబంధించిన బీవోడీ, సీవోడీ, టీఎస్ఎస్, పీహెచ్ తదితర పారామీటర్లు డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శించాలని సూచించారు. నీటి నాణ్యతపై పారదర్శకత పెంచడంతో పాటు, వినియోగదారులకు నమ్మకం కలిగించేలా ఈ ఏర్పాట్లు ఉండాలన్నారు.

శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని పెంచడం ద్వారా విలువైన తాగునీటిని ఆదా చేయవచ్చని ఎండీ పేర్కొన్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, వాణిజ్య సంస్థలు, భారీ వినియోగదారులు తాగేతర అవసరాలకు శుద్ధి చేసిన నీటినే వినియోగించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల వినియోగాన్ని విస్తరించడంతో పాటు, ఎస్టీపీల నిర్వహణలో నాణ్యత, పారదర్శకత, నిరంతర పర్యవేక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జలమండలి ఎస్టీపీ సీజియం పద్మజ, జిఎమ్ సుబ్బారాయుడుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.