పరిశోధనలో విమర్శనాత్మక మూల్యాంకనమే కీలకం
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ఐసర్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలోస్ కోషి
హైదరాబాద్,మేజర్ న్యూస్ ప్రతినిధి : పరిశోధనలోని శాస్త్రీయ స్వభావం కేవలం అధ్యయన అంశంపైనే కాకుండా, పరిశోధన పద్ధతులు, పరీక్షలు, విమర్శనాత్మక మూల్యాంకనం, జ్ఞానాన్వేషణపై ఆధారపడి ఉంటుందని ఐసర్ మొహాలీ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలోస్ కోషి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని అప్లైడ్ సైకాలజీ విభాగం గురువారం ‘విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రీయంగా మార్చేది ఏమిటి? మారుతున్న పద్ధతులు, వాస్తవికత భావనలు’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం నిర్వహించింది.
ఈ సందర్భంగా డాక్టర్ కోషి శాస్త్రీయ తార్కికత, పరిశోధన పద్ధతుల పరిణామం, తత్వశాస్త్రం-మనస్తత్వశాస్త్రం మధ్య సంబంధాలను వివరించారు. కార్ల్ పాపర్ మిథ్యావాద సిద్ధాంతం, థామస్ కూన్ శాస్త్రీయ మార్పు సిద్ధాంతం సహా పలు కీలక తాత్విక భావనలను విశ్లేషించారు. శాస్త్రీయ సిద్ధాంతాల నిర్ధారణ, పరికల్పనల పరీక్ష, వాటి మూల్యాంకనంలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు.