విదేశీ ఆస్తుల వెల్లడింపుపై ఆదాయపు పన్ను శాఖ సంవాదాత్మక సదస్సు
హిమాయత్ నగర్ , మేజర్ న్యూస్ :ఆదాయపు పన్ను శాఖ, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గురువారం ఆదాయపు పన్ను టవర్స్, ఏ.సి. గార్డ్స్, హైదరాబాద్ లో ఫాస్ట్ - డీఎస్ - విదేశీ ఆస్తుల చిన్న పన్ను చెల్లింపుదారుల వెల్లడింపు పథకం 2026 పై అత్యంత విజయవంతమైన అవుట్ రీచ్ & అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సదస్సులో శాఖ ఉన్నతాధికారులు ఈ పథకం యొక్క అర్హత, ఎలక్ట్రానిక్ వెల్లడింపు ప్రక్రియ, చెల్లింపులు, గడువు మరియు లభించే మినహాయింపుల గురించి వివరంగా తెలియజేశారు. సిఐటి (టీడీఎస్) శివ సేవక్, అడిషనల్ సిఐటి (టెక్) శంకర్ పాండి, డి సి ఐ టి (టిడిఎస్) ఏ. భార్గవ శేఖర్, డి సి ఐ టి శుభం సింగ్, డి సి ఐ టి )టెక్నికల్) రాజీవ్ రమేష్ మేశ్రామ్,
ట్యాక్స్ బార్ అసోసియేషన్ కు చెందిన
అధ్యక్షులు అవధేష్ ప్రసాద్ దాహిమా, కార్యదర్శి సిఏ పి.వి. నారాయణ రావు, కోశాధికారి పంకజ్ సంచేతి,కార్పొరేట్ సంస్థల నుండి:డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వర్చుసా, మైక్రోసాఫ్ట్, డెలాయిట్ తదితర ప్రముఖ కంపెనీల సీనియర్ మేనేజర్లు మరియు వైస్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.
ఈ పథకం చిన్న పన్ను చెల్లింపుదారులు భయం లేకుండా స్వచ్ఛందంగా తమ విదేశీ ఆదాయం & ఆస్తులను వెల్లడించడానికి ఒక స్వర్ణావకాశమని శాఖ అత్యంత మానవీయంగా & సహకారపూర్వకంగా తెలియజేసింది.
పథకం దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 31, 2026 గా తెలిపారు.అర్హులైన పన్ను చెల్లింపుదారులందరూ ఈ ఒక్కసారి లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాఖ విజ్ఞప్తి చేసింది.