BREAKING
స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం ఖాయం ప్రపంచంలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదిక విచిత్రమైన నోబాల్ వివాదం: కీపర్ చేసిన చిన్న పొరపాటుకు బౌలర్‌కు శిక్ష.. రూల్స్ ఏం చెబుతున్నాయి? అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం . పరిశోధనలో విమర్శనాత్మక మూల్యాంకనమే కీలకం విదేశీ ఆస్తుల వెల్లడింపుపై ఆదాయపు పన్ను శాఖ సంవాదాత్మక సదస్సు ఓటర్ల జాబితాల ప్రక్షాళనపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దు సూర్య సినిమాలను తాను కావాలని తిరస్కరించలేదన్న నటి నజ్రియా: సీన్ సినిమా విశేషాలు ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం* సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం ఆత్మగౌరవ భవనాల స్ఫూర్తిని కొనసాగించాలి: ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం

సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
సాయి వికాస్ డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

                          విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి – సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్ మేజర్ న్యూస్ :: అరైవ్ అలైవ్ క్యాంపెయిన్‌లో భాగంగా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సంతోష్ నగర్‌లోని సాయి వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమ నిబంధనలు, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై అవగాహన కల్పించారు. ర్యాష్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ ఉల్లంఘన, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు.
అలాగే రహదారి గుర్తులు, రోడ్డు మార్కింగ్‌ల ప్రాముఖ్యతతో పాటు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించి ప్రాణాలు కాపాడే రహ్-వీర్ పథకం గురించి వివరించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.