ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి
కడ్తాల్ రంగారెడ్డి
ఆమనగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) నూతన చైర్మన్‌గా నియమితులైన గూడూరు శ్రీనివాస్ రెడ్డి గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనకు సింగిల్ విండో చైర్మన్ పదవిని కేటాయించినందుకు ఎమ్మెల్యేకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు అందాల్సిన సేవలను సమర్థవంతంగా అందించాలని, రైతుల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహా, నాయకులు బీక్యా నాయక్, కేశవులు, నిట్ట నారాయణతో పాటు పలువురు నూతన పాలకవర్గ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.