ఆమనగల్ సింగిల్ విండో చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియామకం*
*కడ్తాల్ రంగారెడ్డి
ఆమనగల్ PACS సింగిల్ విండో చైర్మన్‌గా కడ్తాల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కడ్తాల్‌లో కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయికంటి బిక్షపతి, ఉపసర్పంచ్ యాదగిరి రెడ్డి, వార్డు సభ్యులు మల్లయ్య, రాజేష్, మాలే మల్లేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతుగంటి శంకర్, రామకృష్ణ, కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.