BREAKING
బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం: కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ కాళ్లకల్‌లో 956 గ్రాముల గంజాయి పట్టివేత* సమస్యలపై యువత గళమెత్తాలి : పల్లపు గోవర్ధన్‌ భారత్, శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: వైజాగ్ స్టేడియానికి మ్యాచ్ కేటాయింపు సమాన స్కాలర్షిప్ కోసం డిమాండ్ జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన గీతా విద్యార్థిని పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నల్ల నర్సింహులు ఎంఐ లండన్ హెడ్ కోచ్ పదవికి కీరన్ పొలార్డ్ గుడ్‌బై: నివేదికల వెల్లడి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస, క్విజ్ పోటీలు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ

Select Suryaa Now
బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ

నిజాంపేట్ మేజర్ న్యూస్ :దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయదారులు మున్సిపల్‌, అగ్నిమాపక శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీపీఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు నిజాంపేట్ సర్కిల్ మేనేజర్ రమేష్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని బాణసంచా దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సులు పొందాలని, అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయాలు చేపట్టాలని సూచించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా దుకాణాల వద్ద అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీటి సదుపాయాలను అందుబాటులో ఉంచాలని కోరారు. అదేవిధంగా ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించకుండా వ్యాపారం నిర్వహించాలని అన్నారు. నిషేధిత బాణసంచాను విక్రయించకుండా, అధికారులు నిర్ణయించిన సమయాల్లోనే బాణసంచా విక్రయాలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై మున్సిపల్ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి దీపావళి పండుగను ప్రమాదరహితంగా జరుపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాలభిందెల శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పొన్నకంటి దస్తగిరి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.