జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన గీతా విద్యార్థిని
తూప్రాన్ ; తూప్రాన్ గీతా స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని కే. నవ్యశ్రీ 32 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ మెదక్ జిల్లా స్థాయి సెమినార్ లో అద్భుత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయికి ఎంపికయింది.నవంబర్ 4వ తేది బుధవారం నాడు మెదక్ జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సెమినార్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను జల సముదాయంలో కరిగించి, శుద్ధిచేసే రసాయన పద్ధతిని చక్కగా వివరించినందుకు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండంట్ పి. రామాంజనేయులు, చైర్మన్ పి. ఉష, డైరెక్టర్లు బి. రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా,భరత్, డాక్టర్ మౌనిక, ప్రిన్సిపాల్ అరుణ, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్, సైన్స్ ఉపాధ్యాయులు నవ్యను అభినందించారు.