పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ
ఆమనగల్లు రంగారెడ్డి:
పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు 12 మంది సింగల్ విండో డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టినట్లు సింగల్ విండో సీఈవో పద్మాకర్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గా కడ్తాల పట్టణానికి చెందిన గూడూరు శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనతోపాటు 12 మంది డైరెక్టర్లు కాలే మల్లయ్య, ఆనంద్ కుమార్, తల్లోజు పెంటమ్మ, గౌని యాదమ్మ, ఒగ్గు వెంకటమ్మ,కర్నాటి భగవాన్ రెడ్డి, నిట్ట నారాయణ, నక్కపోతు నరసింహ, బాల్ రెడ్డి, సీతారాం, కిషన్, రాజు డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వారిని కాంగ్రెస్ పార్టీకి నాయకులు కార్యకర్తలు శాలువాలు, పూలమాలతోఘనంగాసన్మానించి అభినందించారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.