BREAKING
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీనివాస్ రెడ్డి శుద్ధి చేసిన నీటి నాణ్యతపై రాజీ పడొద్దు : అధికారులను ఆదేశించిన ఎండీ అశోక్ రెడ్డి అనిమల్ నుంచి శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ ట్రాన్స్‌ఫర్మేషన్: నటి ఇందిరా కృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు గౌడ్ ల ఆత్మగౌరవ భవన నిర్మాణ జీవో పట్ల హర్షం పంచతత్వం - ప్రకృతికి నీరాజనం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌కు ముందు సాధించాల్సిన 5 భారీ రికార్డులు: క్రికెట్ ప్రపంచం ఎదురుచూపులు కర్మన్ఘాట్ అంజన్న హుండీ ఆదాయం బాణాసంచా విక్రయదారులుప్రభుత్వ నిబంధనలు పాటించాలి బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం: కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ

బాణాసంచా విక్రయదారులుప్రభుత్వ నిబంధనలు పాటించాలి

Select Suryaa Now
బాణాసంచా విక్రయదారులుప్రభుత్వ నిబంధనలు పాటించాలి

 

సీఐ వెంకటేశ్వర్లు

ఆమనగల్లు రంగారెడ్డి: బాణాసంచా విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సిఐ సంద వెంకటేశ్వర్లు చెప్పారు. గురువారం స్థానికపోలీస్ స్టేషన్ఆవరణలో బాణసంచా శాశ్విత, తాత్కాలిక షాపుయజమానులతో  అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐమాట్లాడుతూ దీపావళి పండుగనుపురస్కరించుకొని ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అత్యంత ప్రాధాన్యతఇవ్వాలని షాపు యజమానులనుఆదేశించారు. నిబంధనల ప్రకారం అనుమతి పొందిన ప్రదేశాలలో మాత్రమే లైసెన్స్ కలిగిన షాపులను ఏర్పాటు చేయాలి,ప్రతి షాపు వద్ద సరిపడా నీటి బకెట్లు, ఇసుక,మంటలను ఆర్పే పరికరాలను తప్పనిసరిగాఅందుబాటులో ఉంచుకోవాలి ఆయన పేర్కొన్నారు.బాణసంచా షాపుల వద్ద ఎటువంటి ప్రమాదాలకు తావులేకుండా విద్యుత్ వైరింగ్ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి, ధూమపానం నిషేధం బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని , ప్రభుత్వ అనుమతి లేని అనధికారిక, ప్రమాదకరమైన బాణసంచా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.లైసెన్స్ నిబంధనలు, అగ్నిమాపక భద్రతా సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని, బాణాసంచావిక్రయదారులునిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.ప్రజలంతాసురక్షితంగా పండుగ జరుపుకోవడానికివ్యాపారులు పోలీసులకు సహకరించాలని, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో అలసత్వం వహించవద్దనిహెచ్చరించారు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయాలు నిర్వహించిన, భద్రతా ప్రమాణలు పాటించకున్న సంబంధిత షాపు యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సమావేశంలో బాణాసంచా విక్రయదారులు, తదితరులు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.