సమస్యలపై యువత గళమెత్తాలి : పల్లపు గోవర్ధన్
సోమాజిగూడ/మేజర్ న్యూస్: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో యువత కీలకంగా వ్యవహరించాలని ఖైరతాబాద్ సీనియర్ నేత, భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ అన్నారు. గురువారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఆయన ఖైరతాబాద్ నియోజక వర్గంలోని పీజీ సోషల్ మీడియా కన్వీనర్లు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలు, కాలనీల్లో ఎక్కడిక్కడ సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయని ప్రతీ సమస్యను అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు ప్రశ్నిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అధికారంలో ఉన్న నేతలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారని విమర్శించారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి నియోజక వర్గంలోని అన్ని డివిజన్లలో యువత రాజకీయంగా కీలకంగా వ్యవహరించబోతున్నారని యువత లీడర్లుగా ఎదిగేందుకు ప్రశ్నించే తత్వాన్న అలవర్చుకోవాలని ఆయన సూచించారు.