ఈ నెల 15న హైదరాబాదులో జరిగే "హలో నేతకాని చలో ఉస్మానియా" పోస్టర్ల విడుదల
సూర్య, జన్నారం : ఈనెల 15న హైదరాబాదులో జరగనున్న హలో నేతకాని చలో ఉస్మానియా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం జన్నారం మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం సమీపంలో నేతకాని సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రోగ్రాం కన్వీనర్ సాయిని ప్రసాద్ నేత మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో నేతకాని సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హలో నేతకాని చలో ఉస్మానియా రాష్ట్రస్థాయి భారీ సమావేశాన్ని అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్గీకరణ వల్ల నేతకాని సమాజానికి ఎదురయ్యే సమస్యలను భవిష్యత్తులో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కలిగే ఇబ్బందులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నేతకాని సమాజ హక్కుల సాధన అనేది ఒకరి బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ విడుదల కార్యక్రమంలో ప్రోగ్రాం డైరెక్టర్ తాళ్లపల్లి రాజేశ్వర్, వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాస్, కో కన్వీనర్ జాడి గంగాధర్, నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం వినోద్ కుమార్, మండల అధ్యక్షులు రత్నం లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు దుర్గం వసంత్, తదితరులు పాల్గొన్నారు.