మృతుల కర్మకాండలకు నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి 80,000ఆర్థిక సాయం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. మున్సిపాలిటీకే పరిమితమైన అంత్యక్రియల ఆర్థిక సహాయాన్ని ఇప్పుడు ఆత్మకూరు మండలంలోని రూరల్ గ్రామాలకు కూడా విస్తరించి, పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.బుధవారం
మొత్తం 8 కుటుంబాలకు 10,000చొప్పున 80,000 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
గ్రామీణ ప్రాంతం లోని ఇటీవల మృతి చెందిన
కరటం పాడు శ్రీనివాసపురం ఎస్సీ కాలనీకి చెందిన గంగ పట్ల నాగయ్య కుటుంబాన్ని,
మహిమలూరు గ్రామానికి చెందిన తోట చలమయ్య కుటుంబాన్ని,వెన్నవాడ గ్రామానికి చెందిన చల్లా కృష్ణారెడ్డి కుటుంబాన్ని,
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని3 వ వార్డు ఎస్టీ కాలనీకి చెందిన సోమ సీనయ్య కుటుంబాన్ని,
15 వ వార్డు మేదర వీధి ఎస్టి కుటుంబానికి చెందిన పొట్లూరి భవాని కుటుంబాన్ని,24 వ వార్డు ఎస్టీ మోడల్ కాలనీ కి చెందిన యాటగిరి ఆదెమ్మ కుటుంబాన్ని,14వ వార్డు చింత చెట్ల కాలనీకి చెందిన కొణిదల వెంకటరమణయ్య కుటుంబాన్ని,20వ వార్డు ఏకలవ్య నగర్ ముస్లిం కుటుంబానికి చెందిన షేక్ మగ్బూల్ జాన్ కుటుంబాన్ని ప్రమేశ్వర్ రెడ్డి పరామర్శించి ఆయా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. గత రెండేళ్లుగా పట్టణ ప్రాంతానికే పరిమితమైన ఈ సేవను గ్రామాల్లోని పేదల కష్టాలను గుర్తించి మండల వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు నిరంతర అన్నదాన కార్యక్రమం ద్వారా వేలమంది ఆకలి తీరుస్తున్నారు.కులమతాలకు అతీతంగా పేదరికమే ప్రాతిపదికగా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి గడపకు వెళ్లి పరామర్శిస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు.
"ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ తమ వారి అంత్యక్రియలకు ఇబ్బంది పడకూడదనేదే తన సంకల్పం అని కంచి పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు.
శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం మానవసేవయే మాధవసేవ అని కంచి పేర్కొన్నారు.