అద్దంకిలో రైస్ మిల్లులను డీఎస్ఓ ఆకస్మిక తనిఖీ.లు
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి పట్టణంలోని సంజీవ్ నగర్, కలవకూరు రహదారిలోని రైస్ మిల్లులను ప్రకాశం జిల్లా డీఎస్ఓ పద్మశ్రీ గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. బియ్యం రకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. వ్యాపారులు ప్రతి శుక్రవారం తమ స్టాకు వివరాలను ఆన్లైన్‌లో అప్డేట్ చేయాలని వ్యాపారికి సూచించారు. ఆమెతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డీటీ రామకృష్ణ ఉన్నారు.
నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి….
వినియోగదారులకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నాణ్యమైన బియ్యం అమ్మాలని డీఎస్ఓ పద్మశ్రీ వ్యాపారులకు సూచించారు. జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న బియ్యం నిల్వలను, నాణ్యతను డీఎస్‌ఓ స్వయంగా పరిశీలించారు. బీపీటీ రైస్ కేజీ రూ.66, HMT, RNR రకం కేజీ రూ.76కే విక్రయిస్తూ ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విక్రయాలు జరపాలన్నారు.