BREAKING
జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు

మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం

Select Suryaa Now
మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం

మార్కాపురం, మేజర్‌న్యూస్‌:
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా వారీగా సన్నద్ధత, పరిపాలనా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పొదిలి నగర పంచాయతీకి ఎన్నికలు : 
రాష్ట్ర వ్యాప్తంగా 23 పట్టణ స్థానిక సంస్థల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయతీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. నవంబర్ 17న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నవంబర్ 19వ తేదీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 26న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 30వ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.

మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు :
రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 16న రెండో దశ, నవంబర్ 19న మూడో దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మొదటి దశ పంచాయతీలకు నవంబర్ 26వ తేదీన ఎన్నికలు జరగనుండగా.. రెండో దశ పంచాయతీలకు నవంబర్ 29న ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 2వ తేదీ జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా తీసుకుని నామినేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.