BREAKING
జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు

బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ.150కే సినిమా టికెట్!

Select Suryaa Now
బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ.150కే సినిమా టికెట్!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నపిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆకట్టుకునేలా రూపొందిన వినూత్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చిల్డ్రెన్స్ డే ప్రత్యేక కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర బృందం పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

పిల్లలందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలనే సదుద్దేశంతో నిర్మాతలు టికెట్ ధరలను భారీగా తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయంపై నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ, తమ చిత్రంలోని భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ హత్తుకునేలా ఉంటాయని తెలిపారు. పిల్లల మార్కులను కాకుండా వారి మనసులను అర్థం చేసుకోవాలనే గొప్ప సందేశంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, అందుకే పిల్లల కోసం టికెట్ రేట్లను రూ.250 నుంచి రూ.150కి తగ్గించామని ఆమె వెల్లడించారు. సహ నిర్మాత షఫి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని కేవలం పిల్లలకు కానుకగా అందించాలనే లక్ష్యంతోనే టికెట్ ధరను రూ.150కి పరిమితం చేశామని, ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతుండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సినిమాను కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక సామాజిక బాధ్యతతో రూపొందించామని దర్శకుడు నవీన్ దేశబోయిన స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా థియేటర్లను బుక్ చేసుకున్నాయని, పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా చూడాల్సిన చిత్రమిదని ఆయన వివరించారు. ఇదే సమయంలో కొందరు కావాలనే వేరే చిత్రాలను చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, ఆ విషయంలో ప్రేక్షకులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ముందు నుంచీ పిల్లల కోసమే రూపొందిన తమ ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రాన్ని నవంబర్ 14న థియేటర్లలో ఆదరించాలని దర్శకుడు కోరారు.

చిత్రంలోని సంగీతం మరియు సాహిత్యం గురించి ట్యూన్స్ అండ్ లిరిసిస్ట్ ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ, సినిమాలోని పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన పాత్రధారి మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ, బాలల దినోత్సవ ప్రత్యేక చిత్రంగా వస్తున్న తమ సినిమా పిల్లలతో పాటు పెద్దలకు, ఉపాధ్యాయులకు చక్కటి సందేశాన్ని అందిస్తుందని, తగ్గిన టికెట్ ధరలతో అందరూ థియేటర్లకు వచ్చి సినిమాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.