BREAKING
జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా విద్యార్థులకు అభినందన ఒకవైపు గుంతలు బాబోయ్.. మరోవైపు దుర్వాసన! పూతలపట్టు నుండి పోలవరం వెళ్లే రోడ్డు పరిస్థితి ఇది.. ఇటుపక్క వెళ్లలేకపోతున్నాం మొర్రో అంటున్న వాహనదారులు, స్థానికులు

రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నూతన భవన నిర్మాణానికి అడుగులు!

Select Suryaa Now
రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నూతన భవన నిర్మాణానికి అడుగులు!

30 సెంట్ల స్థలం పరిశీలన
బాడంగి, నవంబరు 12 (మేజర్ న్యూస్): మండలంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీఓ)కు నూతన భవన నిర్మాణం చేపట్టేందుకు అధికారులు గురువారం స్థల పరిశీలన నిర్వహించారు. వెలుగు ఏపీఎం ఏ. రత్నకుమార్‌ తన సిబ్బందితో కలిసి బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో ప్రభుత్వం కేటాయించిన 30 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనం అందుబాటులోకి వస్తే రైతులకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
భవన నిర్మాణం పూర్తయితే రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం కల్పించే రాయితీలతో సరసమైన ధరలకు అందించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సంఘంలోని రైతులందరూ ఒకే వేదికపై సమావేశమై వ్యవసాయ సంబంధిత సమస్యలు, సాగు పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలపై చర్చించుకోవడానికి అవకాశం కలుగుతుందని వివరించారు. రైతుల సంఘటిత అభివృద్ధికి, పరస్పర సహకారానికి నూతన భవనం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు