బాలల్లో న్యుమోనియా నివారణకు ప్రత్యేక కార్యక్రమం
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల్లో న్యుమోనియా వ్యాధిని నివారించడం, వ్యాధిని తొలిదశలో గుర్తించడం, సకాలంలో వైద్య చికిత్స అందించడం కోసం ' సాంస' అనే ప్రత్యేక కార్యక్రమం అవగాహన చికిత్స కార్యక్రమం చేపట్టనున్నట్లు 'జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల మరణాలకు న్యుమోనియా ఒక ప్రధాన కారణమని, ఐదేళ్ల లోపు పిల్లల మరణాల్లో సుమారు 17.2 శాతం న్యుమోనియా కారణంగా సంభవిస్తున్నాయని తెలిపారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా చిన్నారుల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బందితో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామని వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఎం ఎల్ హెచ్ పి సి హెచ్ ఓ లు ఏఎన్ ఎం ఆశా కార్యకర్తలు మరియు ఆశా ఫెసిలిటేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు,- అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో న్యుమోనియా చికిత్సకు అవసరమైన అమోక్సిసిలిన్, జెంటామైసిన్, ఆంపిసిలిన్ వంటి మందులు, పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, నెబ్యులైజర్లు అందుబాటు లోకి తెస్తామని ఆశా కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్ల ద్వారా ఇంటింటి సందర్శనలు నిర్వహించి ఐదేళ్ల లోపు పిల్లల్లో న్యుమోనియా లక్షణాలను గుర్తించి- సమీప ఆరోగ్య కేంద్రాలకు పంపి చికిత్స అందిస్తామన్నారు. తల్లిపాలు, మొదటి ఆరు నెలల పాటు సంపూర్ణ తల్లిపాలు ఇవ్వడం, చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, వాయు కాలుష్య నివారణ మరియు న్యుమోనియా నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పిసివి వ్యాక్సినేషన్ నూరు శాతం పిల్లలకు మూడు డోసులు అందిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చెప్పారు