BREAKING
ఎమ్మెల్యే ధూళిపాళ్ నరేంద్ర కుమార్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన తిరుమల టీ స్టాల్ జానపాడు రోడ్డులో రోడ్డుపైనే వాహనాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో గల తిరుమల టీ స్టాల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రాత్రి సమయంలో ఈ టీ స్టాల్ వద్ద వచ్చే వినియోగదారులు ఫీజులు చెల్లించాలని వేధింపులు పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది.. ‘ఈఎన్ఈ రిపీట్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు! రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఒప్పందం : రూ.18,811 వేల కోట్ల పెట్టుబడి, మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ! అయ్యప్ప దీక్ష పవిత్రమైనది లిటిల్ హార్ట్స్ కంటే పెద్ద విజయం సాధించాలి.. ‘DNK’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్ మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ.150కే సినిమా టికెట్! రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నూతన భవన నిర్మాణానికి అడుగులు! బెంగళూరులో ప్రముఖులతో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక భేటీ : తంగాల వేణుగోపాల్‌,రఘురామ కృష్ణమరాజు,గురజాల జగన్మోహన్ లతో ఆత్మీయ సమావేశం ఘనంగా ప్రారంభమైన బొగ్గు నాణ్యత వారోత్సవాలు 2026

ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి : వైద్యులకు ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆదేశం

Select Suryaa Now
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి : వైద్యులకు ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆదేశం

మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రం,మదనపల్లెలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగుల కు అందుతున్న వైద్యసేవలు,అందుబాటులో ఉన్న వైద్యసదుపాయాలు,ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను ఆయన స్వయంగా పరిశీలించారు.చికిత్స పొందుతున్న రోగులు,వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి వైద్య సేవల నాణ్యత,వైద్యులు,నర్సులు,ఇతర సిబ్బంది పనితీరు,వారి ప్రవర్తనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం సంబంధిత వైద్యాధికారులు,సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.ఆసుపత్రిలో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని,విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా సమయ పాలనతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రు ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని,ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ రాధికతోపాటు సిబ్బంది,కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి