BREAKING
అయ్యప్ప దీక్ష పవిత్రమైనది లిటిల్ హార్ట్స్ కంటే పెద్ద విజయం సాధించాలి.. ‘DNK’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్ మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ.150కే సినిమా టికెట్! రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నూతన భవన నిర్మాణానికి అడుగులు! బెంగళూరులో ప్రముఖులతో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక భేటీ : తంగాల వేణుగోపాల్‌,రఘురామ కృష్ణమరాజు,గురజాల జగన్మోహన్ లతో ఆత్మీయ సమావేశం ఘనంగా ప్రారంభమైన బొగ్గు నాణ్యత వారోత్సవాలు 2026 అద్దంకిలో రైస్ మిల్లులను డీఎస్ఓ ఆకస్మిక తనిఖీ.లు క్రీడాకారులకు అభినందనలు బాపట్ల జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాము : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి పీఠంపై గురి వరించేది ఎవరనీ! భక్తుల సౌకర్యార్థం అహోబిల క్షేత్రానికి ఆటో విరాళం సత్తుపల్లికి బదిలీ వద్దే వద్దు..! జిల్లాలో జనాభా గణన విజయవంతం చెయ్యండి

మనవరాలి ప్రాణాల కోసం ప్రాణత్యాగం.. బైతరణి నదిలో అవ్వ,తాతలు జలసమాధి

Select Suryaa Now
మనవరాలి ప్రాణాల కోసం ప్రాణత్యాగం.. బైతరణి నదిలో అవ్వ,తాతలు జలసమాధి

పెద్దపంజాణి, మేజర్ న్యూస్:
చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి క్రాసులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న మనవరాలి ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో అవ్వ, తాత ఇద్దరూ మృత్యుఒడికి చేరుకున్నారు. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ సమీపంలోని బైతరణి నదిలో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గంగవరం మండలం మేలుమాయి క్రాసు లో రైస్ మిల్లు నిర్వహించే శ్రీనివాసులు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశా పర్యటనకు వెళ్లారు. భువనేశ్వర్ సమీపంలో ప్రవహిస్తున్న బైతరణి నది వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడిన మనవరాలును చూసి అవ్వ,తాతల గుండె తల్లడిల్లిపోయింది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, చిన్నారిని కాపాడేందుకు అవ్వ తాత ఇద్దరూ నదిలోకి దూకారు. దీంతో వారు నదీ గల్లంతయ్యారు. కళ్లముందే జరిగిన ఈ ఘోరంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే ఆ దంపతులు ఇలా అకాల మరణం చెందడంతో మేలుమాయి క్రాసులో విషాద వాతావరణం నెలకొంది. మనవరాలిపై ఉన్న అపారమైన ప్రేమతో తమ ప్రాణాలనే ఫణంగా పెట్టిన ఆ వృద్ధ దంపతుల త్యాగాన్ని తలచుకుని గ్రామస్థులందరూ కంటతడి పెడుతున్నారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి రిపోర్టర్ పెద్దపంజాణి