BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

జిల్లాలో జనాభా గణన విజయవంతం చెయ్యండి

Select Suryaa Now
జిల్లాలో జనాభా గణన  విజయవంతం చెయ్యండి

తిరుపతి జిల్లాలో జనాభా గణన  విజయవంతం చెయ్యండి

* డి.ఆర్ ఓ, సి.పి.ఓ
తిరుపతి జిల్లాలో జనాభా గణన (సెన్సెస్–2027) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో, సమష్టి కృషితో పనిచేయాలని డి.ఓ. .ఆర్ సి.పి.ఓ సూచించారు.గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మీటింగ్ హాల్ నందు జనగణన–2027లో భాగంగా నిర్వహించనున్న జనాభా గణన ప్రక్రియకు సంబంధించి జిల్లాలో జిల్లా స్థాయి ఫీల్డ్ ట్రైనర్స్ ట్రైనింగ్ నిర్వహించారు.  డిఆర్ఓ నరసింహులు , సి.పి.ఓ రాజశేఖర్,  జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ సెన్సస్ రమాదేవి , మాస్టర్ ట్రైనర్ ఉదయ్, సుధా రాణి లతో కలసి సంబందిత జనగణన కు కేటాయించిన సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  
ఈ సందర్భంగా సి.పి.ఓ .మాట్లాడుతూ.... జనాభా గణన కార్యక్రమంలో టీమ్ వర్క్ అత్యంత కీలకమని, ప్రతి అధికారి తమకు కేటాయించిన బాధ్యతలను స్పష్టంగా అర్థం చేసుకుని సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు జనాభా గణన విధివిధానాలు, వివరాల సేకరణ ప్రక్రియపై సమగ్ర శిక్షణ అందించాలని తెలిపారు.
శిక్షణ పొందిన ఫీల్డ్  ట్రైనర్లు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు నాణ్యమైన శిక్షణ అందించి, జనాభా గణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. ప్రతి దశలో సమన్వయం, ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ, బాధ్యతాయుతమైన విధుల నిర్వహణ ద్వారా తిరుపతి జిల్లాలో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాస్టర్ ట్రైనర్లు జన గణన పై సంబందిత ఫీల్డ్ ట్రైనర్సకి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.  

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,