BREAKING
ఫీజులు చెల్లించాలని వేధింపులు పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది.. ‘ఈఎన్ఈ రిపీట్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు! రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఒప్పందం : రూ.18,811 వేల కోట్ల పెట్టుబడి, మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ! అయ్యప్ప దీక్ష పవిత్రమైనది లిటిల్ హార్ట్స్ కంటే పెద్ద విజయం సాధించాలి.. ‘DNK’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్ మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ.150కే సినిమా టికెట్! రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నూతన భవన నిర్మాణానికి అడుగులు! బెంగళూరులో ప్రముఖులతో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక భేటీ : తంగాల వేణుగోపాల్‌,రఘురామ కృష్ణమరాజు,గురజాల జగన్మోహన్ లతో ఆత్మీయ సమావేశం ఘనంగా ప్రారంభమైన బొగ్గు నాణ్యత వారోత్సవాలు 2026 అద్దంకిలో రైస్ మిల్లులను డీఎస్ఓ ఆకస్మిక తనిఖీ.లు క్రీడాకారులకు అభినందనలు

మిట్స్‌ వర్శిటీలో ముగిసిన ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ : పాల్గొన్న ఎన్‌ఐటీ,ఐఐఎస్సీ,ఐఐటీ ప్రముఖులు

Select Suryaa Now
మిట్స్‌ వర్శిటీలో ముగిసిన ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ : పాల్గొన్న ఎన్‌ఐటీ,ఐఐఎస్సీ,ఐఐటీ ప్రముఖులు

కురబలకోట,మేజర్ న్యూస్ : మదనపల్లి సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం వారు ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అకాడమీ (ఈ అండ్ ఐసీటీ అకాడమీ) సహకారంతో "స్మార్ట్ అండ్ సస్టైనబుల్ వైర్లెస్  కమ్యూనికేషన్ : రీసెంట్  ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్  అప్లికేషన్స్” అనే అంశంపై 10 రోజుల ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించిన విభాగానికి గురువారం ఉపకులపతి డాక్టర్ సి.యువరాజ్ అభినందనలు తెలియజేశారు.10 రోజులపాటు ఈ కార్యక్రమంలో ఎన్‌ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్.అనురాధ,ఐఐఎస్సీ బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ టి.శ్రీనివాస్,ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పి.కె.సాహుయూ వక్తలుగా వ్యవహరించారని భవిష్యత్తు అందుబాటులోకి రానున్న 6జీ సమాచార వ్యవస్థల్లో ప్రదేశ ఆధారిత సంకేత ప్రసారం,యాంటెన్నా సూచికల ద్వారా సమాచార ప్రసారం వంటి ఆధునిక పద్ధతుల ప్రాముఖ్యతను ఈ కార్యక్రమంలో వివరించారని ఆయన అన్నారు.తక్కువ విద్యుత్ శక్తిని వినియోగిస్తూ ఎక్కువ సమాచారాన్ని వేగంగా పంపే విధానాలను మరియు పరికరాల నిర్మాణ సంక్లిష్టతను తగ్గించి,సమాచార ప్రసార సామర్థ్యాన్ని పెంచే అవకాశాలను ఇందులో వివరించారన్నారు.ఈ 10 రోజుల ఆన్‌లైన్ శిక్షణా కార్యక్రమంలో 5జి సాంకేతికత,భవిష్యత్ తరాల వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థలు,ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు,వాటి ఆచరణాత్మక అనువర్తనాలపై అధ్యాపకులకు ప్రత్యేక అవగాహన కల్పించారు.దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు,విశ్వవిద్యాలయాలకు చెందిన 100 మందికిపైగా అధ్యాపకులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారన్నారు.ఐఐటీలు,ఎన్‌ఐటీలు,ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలకు చెందిన ప్రొఫెసర్లు,నిపుణులు వివిధ సాంకేతిక అంశాలపై ఉపన్యాసాలు అందించి,వైర్‌లెస్ కమ్యూనికేషన్ రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు,అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై తమ అనుభవాలను పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి.గోరె,కో-ఆర్డినేటర్స్ డాక్టర్ ఎం రంజిత్,డాక్టర్  సుబ్బారావులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి