BREAKING
తుఫాన్ పై అంగన్వాడీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి బాహుబలి తర్వాత చావు అంచుల దాకా వెళ్లా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్ వైరల్ కెనడాలో జ్ఞాపకశక్తి, స్పృహ కోల్పోయిన తర్వాత కూడా దయామరణానికి అనుమతి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా యాతపేట, పెదబొడ్డేపల్లి ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రష్యా నిరంతర దాడుల నేపథ్యంలో నూతన జల రవాణా మార్గాల నిర్మాణం తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!. థేల్స్ కంపెనీ సివిల్, మిలిటరీ రాడార్ వ్యవస్థల ఎంపిక పాకిస్తాన్‌పై శ్రీలంక ఘన విజయం.. 8 వికెట్లతో గెలిచి ట్రై సిరీస్ ఫైనల్‌కు అర్హత అనకాపల్లి జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి పల్లేల సాయి కిరణ్. అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా చీడికాడ కూటమి జెడ్పిటిసి అభ్యర్థి ఖతార్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ సద్భావన ప్రదర్శించాలి...ఖతార్ స్పష్టీకరణ విజయ్ దేవరకొండ రణబాలి సినిమా నుంచి కోబలి ఫుల్ వీడియో సాంగ్ విడుదల అర్నబ్ తుపాను ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - హోంమంత్రి అనిత కోనసీమ ప్రజలకు అండగా ఉంటా

డీఎస్సీ–2024 ఉపాధ్యాయులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించాలి -ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి

Select Suryaa Now
డీఎస్సీ–2024 ఉపాధ్యాయులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రకటించాలి -ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి

డీఎస్సీ–2024 ద్వారా నియామకమైన ఉపాధ్యాయుల అన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ సమస్యను పరిష్కరించేందుకు, డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి కోరారు.
ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కు ఆయన వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ–2024 ద్వారా నియామకమైన ఉపాధ్యాయుల ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల అన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. డైరెక్టర్ ఆదేశాలను అమలు చేసి, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డీఈఓను కోరారు.
ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ఉపాధ్యాయులకు రావాల్సిన వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్ ప్రయోజనం అందుతుందని ఎస్. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఎం. అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు మల్లయ్య, నరసింహ, తాడూరు మండల అధ్యక్షులు కే. సురేష్ బాబు, బిజినపల్లి మండల అధ్యక్షులు శేఖర్, వెంకట్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

సందడి రవీందర్ రెడ్డి,నాగర్‌కర్నూల్, రూరల్, సూర్య న్యూస్: