చంద్రారెడ్డి'ని కలిసిన మా అంబి మహిళా సేవా సమితి సభ్యులు
జిన్నారం;దసరా పండుగను పురస్కరించుకొని బొల్లారం డివిజన్'కు చెందిన "మా అంబి మహిళా సేవా సమితి సభ్యులు" గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వి.చంద్రారెడ్డి'ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వి.ప్రమీల చంద్రారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయదశమి కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా చంద్రారెడ్డి ఆకాంక్షించారు. సేవా సమితి ద్వారా చేపట్టే ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు వి .ప్రత్యూష-ప్రవీణ్ రెడ్డి, దంపతులు, స్థానిక నాయకులు దీనానాద్, అబ్దుల్ బషీర్, మా అంబి మహిళా సేవా సమితి సభ్యులు దుర్గవతి దేవి, పరంశీల దేవి, ప్రమీల, అనిత, ఆశాదేవి తదితరులు పాల్గొన్నారు.