BREAKING
న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం శ్రీకాకుళం జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులు కూడా తీసుకురాలేనీ ప్రభుత్వం:మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతి లేని పాలన అందిస్తా.. అభివృద్ధికి అంకితమవుతా...! సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి..... మంత్రతంత్రాల పేరుతో రూ.లక్షల్లో టోకరా - అంతర్రాష్ట్ర ముఠాలో ఐదుగురి అరెస్టు షీలానగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ అర్షియా భాను ప్రమాణ స్వీకారం నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు...

భవనం లేక చెట్టు కిందే గ్రామసభ!

Select Suryaa Now
భవనం లేక చెట్టు కిందే గ్రామసభ!
 
 
- అసంపూర్తి పనులపై ప్రజల ఆగ్రహం
- పలు అభివృద్ధి పనులకు తీర్మానం
 
సూర్య - మానకొండూర్ :
 
సొంత భవనం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలంతా చెట్టు కింద కూర్చుని గ్రామసభ నిర్వహించిన వినూత్న సంఘటన మానకొండూరు మండలం దేవంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం గ్రామంలో వీబీజీ రామ్ జీ గ్రామసభను నిర్వహించారు. అయితే నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు సుదీర్ఘ కాలంగా అసంపూర్తిగానే నిలిచిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిలిడ నీడనే ఈ సభను జరపాల్సి వచ్చింది. దీనిపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భవన నిర్మాణంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోందని, పనులను త్వరగా పూర్తి చేసి నూతన భవనాన్ని ఎప్పుడు వాడుకలోకి తెస్తారని సభ వేదికగా పంచాయతీ పాలకవర్గాన్ని నిలదీశారు. 
సదుపాయాలు లేకపోయినా చెట్టు నీడనే సాగిన ఈ సభలో గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను గుర్తించి తీర్మానాలు చేశారు. ఎస్సారెస్పీ కాలువ (కెనాల్) నుండి చెంజర్ల వరకు మట్టి రహదారి (ఫార్మేషన్ రోడ్డు) నిర్మాణం, దాడి ఐలయ్య నివాసం నుండి బంధం రహదారి వరకు, అలాగే రేవెల్లి రాజయ్య నివాసం నుండి గట్టపల్లి వరకు మట్టి రహదారుల నిర్మాణ పనులను గుర్తించారు. వీటితో పాటు ఐదు ఫారం నిధుల (ఫండ్) ద్వారా డీబీఎం 6 కాలువ నుండి స్థానిక చెరువు వరకు సాగునీటి కాలువల తవ్వకం పనులను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కార్తీక్, పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ) సుస్మిత, జూనియర్ ఇంజనీర్ (జేఈ) అంజయ్య, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.