భక్తిశ్రద్ధలతో..రేజర్లలో శివాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం దుర్గా నాగమల్లేశ్వర స్వామికి మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు
సూర్య,సత్తుపల్లి:* దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ దుర్గా నాగమల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన శివాద్రి గిరి ప్రదక్షిణకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఈ గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు.
దేవస్థానానికి చేరుకున్న మంత్రికి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయబద్ధంగా శివాద్రి గిరి ప్రదక్షిణను పూర్తి చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.
*ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి భక్తులు, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.* విజయదశమి వేళ దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, స్వామివారి దర్శనం, గిరి ప్రదక్షిణతో భక్తులు భక్తిభావంలో మునిగిపోయారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ