BREAKING
నేషనల్ హైవే అంశంపై రాజకీయ విమర్శలు మానుకోవాలి: బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు చింతకుంటలో విషాదం.. ఇద్దరు కుమారులతో సహా తల్లి మృతి ఇందిరా గాంధీకి భట్టి, వాకిటి నివాళులు భీమా పథకాలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి "శ్రీ త్యాగరాయ ఆచార్య గీతా" (గీతా సంగీత సమన్వయ లహరి) ఇందిరా గాంధీకి మంత్రి పొన్నం నివాళులు ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన.. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ‘ఇండియా’ కూటమి నిరసన NHM ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి.. ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలకు అండగా నిలవండి -ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఎన్ హెచ్ ఎం జేఏసీ బాధ్యుల హృదయపూర్వక విజ్ఞప్తి ఎన్నికల సిబ్బందికి తీపి కబురు: పారితోషికం పెంపు.. జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి స్ఫూర్తిదాయకం ఇందిరా పాలన మొదటి శాకాహార పండ్ల మేత డైనాసర్‌గా 'హెల్ చికెన్' గుర్తింపు మర్పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్ ఘనంగా ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’ ముగింపు కార్యక్రమం

బస్ భవన్‌లో ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

Select Suryaa Now
బస్ భవన్‌లో ఘనంగా సర్దార్ పటేల్ జయంతి వేడుకలు

సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిధిః భారత మొదటి ఉప ప్రధాని దివంగత  సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు హైదరాబాద్ బస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ ఈడీ సిహెచ్.వెంకన్న , పలువురు అధికారులు వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈడీ సిహెచ్.వెంకన్న మాట్లాడుతూ భారతదేశ మొదటి ఉప ప్రధాని , హోంమంత్రిగా దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపు నిచ్చారు. స్వాతంత్య్రానంతరం సుమారు 560కి పైగా ఉన్న స్వదేశీ సంస్థానాలను ఎటువంటి రక్తపాతం లేకుండా భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ఆయన చూపిన అసాధారణ దౌత్యనీతి, దృఢ సంకల్పం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిందని ఆయన పేర్కొన్నారు.  దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చి 'ఉక్కు మనిషి గా ఖ్యాతిగాంచిన ఆయన, ఆధునిక భారతదేశ నిర్మాణంలోనూ, పటిష్టమైన పరిపాలనా వ్యవస్థ ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారని ఈడీ వెంకన్న అన్నారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, దేశ ఐక్యత మరియు అఖండతను కాపాడతామని ఈసందర్భంగా అధికారులు, సిబ్బంది  ప్రతిజ్ఞ చేశారు. ఈకార్యక్రమంలో ఎఫ్ఏ విజయపుష్ప, సిపిఎం ఉషాదేవి,సిటీఎం భీంరెడ్డి, ఈఈ రమేష్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎ.రవీందర్‌, హైదరాబాద్‌.