BREAKING
కేంద్ర నిధులకు బిఆర్ఎస్ స్టిక్కర్లు-కేటీఆర్ గొప్పలు సిగ్గుచేటు-వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ గా వెంకట కార్తీక్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ గా బుట్నా లక్ష్మి, ప్రమాణ స్వీకారం. ఏపీలో బియ్యం ధరలకు కళ్ళెం! తొలి టీడీపీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన హనీస్పందన ఇండోనేషియా ఉపాధ్యక్ష అభ్యర్థుల ఎంపిక చైర్మన్‌గా నల్లా శ్రీధర్ ప్రమాణ స్వీకారం.... బ్రెజిల్ ఫెర్రోనికెల్ డీల్‌పై ఐరోపా ఉక్కు సంస్థల డిమాండ్ ప్రపంచ మార్కెట్లలో ఒడుదొడుకులు నేడు ఎస్పీ, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చర్చలు.. అఖిలేష్, రాహుల్ చేతిలో తుది నిర్ణయం బ్లాక్‌స్టోన్ నుంచి పీజీపీ గ్లాస్ కొనుగోలుకు బ్రూక్‌ఫీల్డ్ ఒప్పందం పొన్నూరు 38వ వార్డు లో జోరందుకున్న వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ సల్మాన్ ఎన్నికల ప్రచారం సేవల రంగం నెమ్మదించినా తయారీ డిమాండ్‌తో భారత్ ఆర్థిక జోరు ఐరోపాలో క్లౌడ్ సార్వభౌమత్వం దిశగా అడుగులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లకు పాల్పడొద్దు..

ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

Select Suryaa Now
ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

సూర్య క్రైమ్ డెస్క్: ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (SNCU) వార్డులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో కేవలం ఐదు రోజుల వయసున్న పసికందు ఊపిరాడక మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఈ ఘటనతో వార్డులో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మిగిలిన చిన్నారులను పక్క వార్డుకు సురక్షితంగా తరలించారు. ఈ ప్రమాద సమయంలో వార్డులో చికిత్స పొందుతున్న మొత్తం 24 మంది చిన్నారులను వేగంగా వేరే ప్రాంతాలకు మార్చగా, వారిలో ముగ్గురి పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు రిమ్స్‌కు చేరుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.