BREAKING
ఉపాధ్యాయురాలికి జిల్లాస్థాయి గౌరవం స్టాక్ ఇండెక్స్ పెర్పెచ్యువల్ ఫ్యూచర్స్‌ను ప్రారంభించిన కాల్షి కరువు అంచనాలు కాదు.. రైతుకు తక్షణ భరోసా కావాలి:చినుకని శివ ప్రసాద్ ఐక్యరాజ్యసమితి వేదికపై అరకు గళం.. దేవాదాయ శాఖ ఇఓగా చిట్టిబాబు కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ ఖరారు.. ఈసారూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే! భక్తి, సేవకే ప్రాధాన్యం.. ఆదర్శంగా ‘టీం విఘ్నేశ్వర’ సమస్యల పరిష్కారమే ధ్యేయం - ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే కావ్య కృష్ణరెడ్డి చెత్తను సద్వినియం చేసుకోవాలి దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ద్వితీయ శ్రేణి ద్రవ్యోల్బణ ముప్పు సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి.. అమెరికాలో దుస్తుల తయారీ సంస్థలపై టెక్సాస్ అటార్నీ జనరల్ విచారణ రాజమహేంద్రవరం పర్యటకానికి నూతన శోభ గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 14 ఏళ్ల బాలిక అదృశ్యం

వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ యూరియా అందించాలి

Select Suryaa Now
వ్యవసాయానికి 18 గంటల నిరంతర విద్యుత్ యూరియా అందించాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి డిమాండ్

మిర్యాలగూడ, మేజర్ న్యూస్:                  రాష్ట్రంలో బోర్లు, బావుల కింద ఖరీఫ్ సీజన్లో వేసిన వరి పైర్లు కరెంటు అందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం వెంటనే 18 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు యూరియా ఎరువులను అందించాలని, అందుకు సంబంధించిన యాప్ ను పునరుద్ధరించా లని కోరారు. ఖరీఫ్ సీజన్ అయిపోయిందనే భావనతో ప్రభుత్వం యూరియా యాప్ ను నిలిపివేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే యాప్ ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.రైతులు ఎకరానికి రూ.30 నుంచి 40 వేలు పెట్టుబడి పెట్టి ఖరీఫ్ లో వరి సాగు చేశారని, ప్రస్తుతం పంట పొట్ట దశకు చేరుకుందని, ఈ సమయం లో నీటి అవసరం ఎంతో ఉందన్నారు. అందుకే ప్రభుత్వం నిరంతరం కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం పేరుకు మాత్రమే 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతోందని, వాస్తవానికి 12 గంటలు కూడా సరిగా రావడం లేదని ఆరోపించారు. అరకొరగా ఇచ్చే కరెంటుతో మొదటి మడికేనీళ్లుఅందుతున్నాయని, మిగిలిన పొలంఎండి పోతోందన్నారు. చివరి దశలోనైనా కనీసం 18 గంటల పాటు నిరంతర విద్యుత్ ఇస్తే రైతులు కొంతలో కొంత అప్పుల బారి నుంచి బయటపడతారని సూచించారు.వర్షాభావ పరిస్థితుల వల్ల బావుల్లో నీరు లేకపోయినా, ఉన్న బావుల కింద సాగయ్యే పంటలకు విద్యుత్ సరఫరా లేకపోవడం ఆటంకంగా మారిందన్నారు. నాగార్జున సాగర్ డ్యాంలో 537.9 అడుగుల వరకు నీరు ఉన్నందున ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలను నింపాలని, తాగునీటి అవసరాలు తీర్చి ప్రజలకు ఇబ్బంది కలగ కుండా చూడాలని కోరారు.
ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం. రవినాయక్, వినోద్ నాయక్, సీపీఎం పట్టణ కార్యదర్శి భావండ్ల పాండు, నాయకులు రామ్మూర్తి, టాప్రా నాయకులు నూకల జగదీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.