వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం
వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం: మండల అధ్యక్షులు తెప్పెల దేవేందర్ రెడ్డి
కాటారం, సెప్టెంబర్ 26, మేజర్ సూర్య న్యూస్:
వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం కావాలని కాటారం మండల అధ్యక్షులు తెప్పల దేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువు నాయకులు పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి, పలువురు నాయకులు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన ఐలమ్మ, నాటి దొరల అణచివేతపై తిరగబడిన అసాధారణ విప్లవ మూర్తి అని పేర్కొన్నారు. కేవలం తన భూమి కోసమే కాకుండా, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె పోరాడారని గుర్తుచేశారు. హక్కుల సాధన కోసం పోరాడే తత్వం ఉంటే సామాన్యులు సైతం చరిత్రను తిరగరాయగలరని ఐలమ్మ నిరూపించారని స్పష్టం చేశారు. నేటి యువత ఆమెను ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరిగే అన్యాయాలపై ప్రశ్నించే అలవాటు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ రెడ్డి,డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య, ముత్తారం మండల అధ్యక్షుడు జాడి రాజయ్య, మహిళా అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, మంథని డివిజన్ యూత్ అధ్యక్షుడు చీమల సందీప్, కాటారం యూత్ అధ్యక్షుడు చిటూరు మహేష్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అజ్మీర కిషన్ నాయక్, కుంభం రమేష్ రెడ్డి, గడవేన దేవేందర్, ఐయిత శకుంతల, భూపెళ్లి రాజు, పసుల మొగిలి, కొట్టే ప్రభాకర్, చీమల రాజు, దేవదాస్, జాగరి రాజబాపు తదితరులు పాల్గొన్నారు.