BREAKING
ముగియనున్న పసిడి రుణాల హవా పోస్టర్ల ఆవిష్కరణ ఆసియా క్రీడల్లో భారత్ ఘనవిజయం ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పునరుద్ధరించాలి వామపక్షాలు డిమాండ్ జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటణ. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 17 ఏళ్ల తర్వాత భారత్-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పందం విజేతలను అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి నగరం లో 245 పోలింగ్ స్టేషన్లో పై అభ్యంతరాల స్వీకరణ భవిష్యత్తు మహమ్మారుల నివారణకు ప్రపంచవ్యాప్త చర్యలు అవసరం సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన ట్రంప్ మహారాష్ట్రలో తీవ్ర కరవు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా దొండపాటి

ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు

ఘనంగా మాజీ పియం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు
గార్ల, 26 సెప్టెంబర్ సూర్య (మేజర్ న్యూస్)భారత దేశ మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గార్ల మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బస్టాఫ్ ప్రాంగణంలో మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి శనివారం పూల దండలు వేసి, నివాళులు అర్పించి, మౌనం పాటించి  జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల  అధ్యక్షులు తాళ్ళపల్లి కృష్ణ గౌడ్, గార్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతీ హతి రామ్ నాయక్ లు మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలకు బలమైన పునాదులు వేసిన దార్షనీయకుడని, దేశాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు నడిపించిన రాజా నీతజ్ఞుడని, భారత దేశపు ప్రగతి ప్రస్తానంలో చెరగని ముద్ర వేసిన మహా  నాయకుడని బహుముఖ ప్రజ్ఞాశాలని,  ప్రముఖ ఆర్థికవేత్తని, పద్మ విభూషణుడని  కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కోల కుమార్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు భూక్య బాబూలాల్ నాయక్, బొడ్డు నరసింహారావు, వేముల పిచ్చయ్య, మొహమ్మద్ మోహిన్, దీకొండ రాము తదితరులు పాల్గొన్నారు.