BREAKING
తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ పామూరు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా దొండపాటి

Select Suryaa Now
బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా దొండపాటి

బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా దొండపాటి నరసాపురం, మేజర్ న్యూస్ :

 త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరపున అభ్యర్థిని నిలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం స్థానిక అంబేద్కర్ భవనంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు సమావేశమై అభ్యర్థిపై సమాలోచనలు చేశారు. అనంతరంమున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా దొండపాటి రవీంద్రనాథ్ పేరును ఖరారు చేశారు.

ఈ కార్యక్రమానికి నర్సాపురం నియోజకవర్గ అధ్యక్షులు గూటం జయ బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా కొల్లబత్తుల ఏలీయా రాజు, ప్రధాన కార్యదర్శి కాటూరి కరుణాకర్ హాజరయ్యారు. దొండపాటి రవీంద్రనాథ్ పేరు ను బల్ల వెంకటేశ్వరరావు(జాన్ బాబు) ప్రతిపాదించగా, ఈదా ప్రకాశం,  కృపారావు, పార్టీ సీనియర్ నాయకులు పీతల మనోహర్రావు బలపరిచారు. ఈ కార్యక్రమంలో మోకా సువర్ణ రాజు  మాట్లాడుతూ దళిత క్రైస్తవులు, దళితులు, బహుజనులు మైనార్టీస్  అన్ని వర్గాల వారు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు, జిల్లా అధ్యక్షులు ఏలీయా రాజు మాట్లాడుతూ  మున్సిపాలిటీ లో ఇప్పటివరకు దళితులు ఎవరు పరిపాలించలేదని ఈసారి బీఎస్పీ  అభ్యర్థిని  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు, ప్రధాన కార్యదర్శి కరుణాకర్ మాట్లాడుతూ రవీంద్రనాథ్ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని గెలుపే లక్ష్యంగా పని చేస్తానని ప్రతిజ్ఞబునారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు మండల పార్టీ అధ్యక్షులు వర్ధనపు సుధాకర్,  

 నరసాపురం మండల పార్టీ అధ్యక్షులు

తిరుపతి  వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి పాలపర్తి ప్రసాద్, నరసాపురం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానేటి సంజీవ్ కుమార్ బీఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

 ఇజ్రాయిల్ నరసాపురం