సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం
సంక్షేమాభివృద్ధి కూటమి పాలన కర్తవ్యం
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
సంక్షేమ అభివృద్ధి అనే రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ ముందుకు సాగుతుందని అందులో భాగంగానే ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను కర్తవ్యం గా భావించి ముందుకు కూటమి ప్రభుత్వం నడుస్తుందని ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రం నందవరం లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు చుట్ట
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా కేజీబీవీ బాలికల వసతి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయం వద్ద ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్ నిధులతో రూ.2.50 కోట్ల వ్యయంతో 8 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.
అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎన్టీఆర్ సుజల స్రవంతి నీటి సరఫరా కేంద్రం, బస్‌స్టాండ్ వద్ద స్వర్ణ సచివాలయం, బీసీ కాలనీ కిందగేరి సీసీ రోడ్డును ప్రారంభించారు. ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన బోర్‌వెల్ నీటి సౌకర్యాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం లింగాయత్ గేరిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్–విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నందవరం మండలంలో రహదారులు, తాగునీరు, సాగునీరు, వైద్యం, విద్య తదితర మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తూ నందవరం మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.