BREAKING
రేవంత్ రెడ్డి కంటపడింది..సిరిసిల్ల ప్రజల పంట పండింది! సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు అంబేద్కర్ ఆశయాలే సమాజ ప్రగతికి బాటలు మెక్సికో వైపు దూసుకొస్తున్న అత్యంత భయంకరమైన 'పోలో' తుఫాను ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు మన్మోహన్ సింగ్ గొల్ల కురుమల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు భవనం లేక చెట్టు కిందే గ్రామసభ! శాతవాహన యూనివర్సిటీ వద్ద ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి డి ఈ ని కలిసిన కొదురుపాక సర్పంచ్ 28న కరీంనగర్‌లో 'శాతవాహన గ్రామీణ సంత' వాల్ పోస్టర్ ఆవిష్కరణ యువతలోని ప్రతిభను వెలికితీయడమే యువజన సాంస్కృతిక పోటీల లక్ష్యం రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం ముగియనున్న పసిడి రుణాల హవా పోస్టర్ల ఆవిష్కరణ

బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్‌, సూర్య ప్రధాన ప్రతినిధి : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను ఖరారు చేసినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అక్టోబర్‌ 5న కేంద్ర జల సంఘం కమిటీ ముందుకు పునరుద్ధరణ డిజైన్లను తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. సాంకేతిక అనుమతులు లభించిన వెంటనే టెండర్లు పిలిచి నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదులను గ్రౌటింగ్‌ విధానంతో బలోపేతం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.

బ్యారేజీల పునరుద్ధరణలో భద్రత, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన చర్యలను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.