BREAKING
బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం నవంబర్‌లో పనులు ప్రారంభిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ పోరుకు ఆనం ‘త్రిశూల వ్యూహం’ స్విమ్మింగ్ పూల్‌లో పువ్వులతో విక్కీ కౌశల్ రొమాంటిక్ లుక్.. నెట్టింట ఫొటోలు వైరల్! భరించలేని అనారోగ్య బాధలు.. కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల ప్రముఖ నటుడు! పండుగల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు నాతో అసలు పనిలేదు.. అయినాసరే ఆ పారితోషికం తిరిగిచ్చేశారు: నటి లయ ఆసక్తికర వ్యాఖ్యలు వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం నటుడు దర్శన్ బెయిల్ కోసం రాష్ట్రపతికి అభిమానుల లేఖ.. సోషల్ మీడియాలో వైరల్! సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...... నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు! గ్లోబల్ స్థాయిలో 'రామాయణం' ప్రమోషన్స్.. మిస్టర్ బీస్ట్‌తో మేకర్స్ మాస్టర్ ప్లాన్! విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..!

ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు

Select Suryaa Now
ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు

 

విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర
జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

వికారాబాద్, సెప్టెంబర్ 26 (సూర్య): విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శనివారం వికారాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. విద్యార్థులకు పౌర హక్కులు, విధులపై అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయిస్తోందన్నారు. పాఠశాలల్లో మరమ్మతు పనులు చేపట్టి తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుత కాలంలో సాంకేతిక విద్య, నైపుణ్యాలకు ప్రాధాన్యత పెరుగుతోందని కలెక్టర్ అన్నారు. యువతకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ) ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో క్రీడలు, వ్యాయామంపై ఆసక్తిని పెంపొందించి శారీరక దృఢత్వంపై కూడా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లాస్థాయిలో ఉత్తమ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.

నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు: పరిగ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట నాణ్యమైన విద్యను అభ్యసించేలా ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏటీసీల ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

విద్యే భావితరాల సంపద: తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూర్ ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల తలరాతను మార్చే శక్తి విద్యకు ఉందని, విద్యకు దశాదిశను నిర్దేశించే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. విద్యపై చేసే ఖర్చును పెట్టుబడిగా కాకుండా భావితరాలకు అందించే సంపదగా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ వికారాబాద్ జిల్లాను విద్యారంగంలో ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రంగరాజన్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.