BREAKING
భరించలేని అనారోగ్య బాధలు.. కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల ప్రముఖ నటుడు! పండుగల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు ఘనంగా మాజీ పీఎం మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు నాతో అసలు పనిలేదు.. అయినాసరే ఆ పారితోషికం తిరిగిచ్చేశారు: నటి లయ ఆసక్తికర వ్యాఖ్యలు వీరనారి ఐలమ్మ పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకం నటుడు దర్శన్ బెయిల్ కోసం రాష్ట్రపతికి అభిమానుల లేఖ.. సోషల్ మీడియాలో వైరల్! సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...... నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు! గ్లోబల్ స్థాయిలో 'రామాయణం' ప్రమోషన్స్.. మిస్టర్ బీస్ట్‌తో మేకర్స్ మాస్టర్ ప్లాన్! విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్.. టాలీవుడ్ అంచనాలు తారాస్థాయికి! ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు కొత్త హెయిర్‌స్టైల్‌తో అనసూయ రచ్చ.. తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీ!

యువ ప్రతిభకు ప్రోత్సాహం.. అరుదైన విజయం

Select Suryaa Now
యువ ప్రతిభకు ప్రోత్సాహం.. అరుదైన విజయం

6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్–2 శిఖరాన్ని అధిరోహించిన విస్లావత్ బన్నీ సూర్య కామారెడ్డిజిల్లా ప్రతినిధి యువత లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని యువ పర్వతారోహకుడు, కామారెడ్డి లోని  తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి  విస్లావత్ బన్నీ నిరూపించారు. బిబిపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ పాశ్రామికవేత్త, విద్యా ప్రదాత, సమాజ సేవకులు అయినటువంటి  తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ప్రోత్సాహం, సహకారంతో ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మియార్ లోయలో 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్–2 శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే పలు పర్వత శిఖరాలను అధిరోహించిన విస్లావత్ బన్నీ, ఈ ప్రతిష్టాత్మక యాత్రలోనూ తన సాహస ప్రతిభను చాటుకున్నారు. క్లిష్టమైన పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేసి యువతలో స్ఫూర్తిని నింపారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారి లక్ష్యాలను సాధించే క్రమంలో అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించాలనే ఉద్దేశంతో సుభాష్ రెడ్డి ఈ యాత్రకు అండగా నిలిచారు. ఆయన అందించిన ప్రోత్సాహం, సహకారానికి విస్లావత్ బన్నీ సాధించిన ఈ విజయం చక్కటి నిదర్శనంగా నిలిచింది. విస్లావత్ బన్నీ, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందానికి అభినందనలు
మౌంట్ తరంగ్–2 శిఖరాన్ని అధిరోహించి ఘనత సాధించిన విస్లావత్ బన్నీకి, ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ బృందానికి పలువురు అభినందనలు తెలిపారు. యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్న  తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డికి  అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.