BREAKING
జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటణ. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 17 ఏళ్ల తర్వాత భారత్-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పందం విజేతలను అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 27 ఆదివారం బ్యాంకులు పనిచేస్తాయి నగరం లో 245 పోలింగ్ స్టేషన్లో పై అభ్యంతరాల స్వీకరణ భవిష్యత్తు మహమ్మారుల నివారణకు ప్రపంచవ్యాప్త చర్యలు అవసరం సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రపోజల్‌ను తిరస్కరించిన ట్రంప్ మహారాష్ట్రలో తీవ్ర కరవు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా దొండపాటి నోటీసులు అందుకున్నవారు బీఎల్‌వోలను కలవాల్సిన అవసరం లేదు అక్టోబర్‌ 4న తెలంగాణకు అమిత్‌ షా ధర్మవరం చెరువు ఆక్రమణలను తొలగిస్తాం రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి

ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు

Select Suryaa Now
ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు

*రైల్వే స్టేషన్‌లో ఈ-ఫిర్యాదుల కియాస్క్ ప్రారంభం*

 

 

విశాఖపట్నం, సెప్టెంబర్ 26:
పౌరులకు పోలీస్ సేవలను మరింత సులభతరం, పారదర్శకంగా, వేగవంతంగా అందించేందుకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘మీ పోలీస్.. మీ ఫ్రెండ్’ డిజిటల్ ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి విశాఖ వేదికగా నిలిచిందన్నారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా రైల్వే స్టేషన్‌లోనే కియాస్క్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కియాస్క్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ను **పీజీఆర్‌ఎస్‌ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ)**కు అనుసంధానం చేయడం ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంలో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ కేసులను ఛేదిస్తున్నారని హోంమంత్రి తెలిపారు. పారిశ్రామికంగా, పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళల భద్రత విషయంలో విశాఖపట్నం ముందంజలో ఉందని పేర్కొన్నారు. సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. విశాఖలో ఈ-ఫిర్యాదుల కియాస్క్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రైల్వే స్టేషన్‌తో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కూడా ఈ-ఫిర్యాదుల కియాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ప్రజలు కియాస్క్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. చదువు రాని వారు సైతం సులభంగా ఫిర్యాదు చేసేలా వాయిస్ ఆధారిత సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.