BREAKING
ప్యారడైజ్ కుక్క సీన్లపై ట్రోల్స్.. రాజమౌళి మగధీరను ఉదాహరణగా చూపుతూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కౌంటర్! కోయంబత్తూరులో సినీ ఫక్కీలో గుట్కా స్మగ్లర్ల పరారీ.. ఎస్‌యూవీపై 40 కి.మీ వేలాడిన హెడ్ కానిస్టేబుల్ హాలీవుడ్ అసలు మాయాజాలం అదే.. టెక్నాలజీ కంటే కథాబలమే ఎందుకు ముఖ్యం! వారణాసి గ్లింప్స్ ఈవెంట్‌లో ఆ సాంకేతిక సమస్య చూసి నిజంగానే ఏడుపొచ్చేసింది: ఎస్.ఎస్. కార్తికేయ చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

ధర్మవరం చెరువు ఆక్రమణలను తొలగిస్తాం రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్

Select Suryaa Now
ధర్మవరం చెరువు ఆక్రమణలను తొలగిస్తాం రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్

 ధర్మవరం చెరువును చారిత్రక, సహజ స్వరూపాన్ని కాపాడుతూ ఆధునిక సౌకర్యాలతో అద్భుతమైన లేక్‌ఫ్రంట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఎస్‌పీఏ విజయవాడ బృందంతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ చెరువును ఆక్రమణలు, మురుగునీటి నుంచి రక్షించి, నీటి శుద్ధితో పునరుజ్జీవింపజేస్తామన్నారు. సుమారు 16 కిలోమీటర్ల వాక్‌వే, జాగింగ్, సైకిల్ ట్రాక్‌లు, పచ్చదనం, లైటింగ్, బోటింగ్, పార్కులు, యాంఫిథియేటర్ తదితర సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ధర్మవరం చేనేత, స్థానిక కళలు, చారిత్రక వారసత్వానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. డీపీఆర్ పూర్తయిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ‘అర్బన్ ఛాలెంజ్’ ద్వారా నిధులు సాధించేందుకు ప్రయత్నిస్తామని, ప్రాజెక్టు వ్యయం ప్రాథమికంగా రూ.100–150 కోట్ల వరకు ఉండవచ్చని మంత్రి వెల్లడించారు.