జనగామ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటణ.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకస్తాపన.
-- డబుల్ బెడ్ రూంల ప్రారంభోత్సవం.
-- ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు పట్టాల పంపిణి.
-- పలువురు మున్సిపల్ వర్కర్లకు నియామాకా పత్రాల అందజేత.
-- ప్రతి పేదవాడి ఇంటి గుమ్మం వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
జనగామ(నియోజకవర్గ )జిల్లా కేంద్రం లో రాష్ట్ర జిల్లాకేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచారం పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. అధికారం పర్యటనలో భాగంగా మంత్రి తన పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్తాపన, ప్రారంభోత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న సందర్భంగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కె. బాలమణి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, ది. సి. పి.,మాజీ శాసన సభ్యులు కొమ్మురి ప్రతాప్ రెడ్డి, ది. పి. సి. సి. అధ్యక్షురాలు దమయంతి లక్ష్మి నారాయణ నాయక్ లు ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు మేళతాలాలు, బోనాలు కొళాటం తో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ సందీప్ ఝా, డిసిపీ రాజ మహేంద్ర నాయక్ లు పుష్పగుచ్చా లనందించారు.
ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ముఖ్య అతిగా మంత్రి పొంగులేటి ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించారు.ఈ సందర్భంగా జనగామ మున్సిపాలిటీకి చెందిన రూ. కోటి 77 లక్షల విలువ గల 16 చెత్త సేకరణ నూతన ఆటోలకు, జేసీబీకి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
మున్సిపాలిటీ పరిధిలో శానిటరీ వర్కర్లు (30) మంది, డ్రైవర్ లు (20), ఎలక్ట్రీషియన్ లు (4)తో కలిపి మొత్తం (54) మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు.
అనంతరం రూ. రెండు కోట్ల విలువ గల మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్ అండ్ మెషినరీ పనులు, అలాగే రూ. 38 కోట్ల విలువ గల మురుగు నీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టీపీ) పనులు, జిల్లాలోని తరిగొప్పుల మండలంలో రూ. 2.25 కోట్ల విలువ గల తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు, జిల్లాలోని బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ ZPHS, MPPS పాఠశాలల్లో రూ.38.75 లక్షల వ్యయంతో భవన మరమ్మతులు, పునరుద్ధరణ పనులు, అలాగే పోచన్నపేట ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.24 లక్షలతో, రామచంద్రాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో రూ.23 లక్షలతో, జిల్లాకేంద్రంలోని కోర్టు వద్ద గల జెడ్పీ ఉన్నత పాఠశాల (బాలికలు) రూ. 20 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, అలాగే జిల్లాలోని 12 కేజీబీవీలు, 15 పీఎం శ్రీ పాఠశాలలు, 28 జెడ్పీహెచ్ఎస్ (బాలికలు) లలో రూ. 1,92,31,996 కోట్లతో అవుట్ డోర్ బాస్కెట్ బాల్ కోర్టుల నిర్మాణ పనులు, రూ. 19.25 లక్షల విలువ గల జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) ఆవరణలో అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులు, రూ. 7.35 లక్షల విలువ గల జనగామ చంపక్ హిల్స్‌లోని మాతా-శిశు ఆసుపత్రి (ఎంసీహెచ్)లో ఆక్సిజన్ ప్లాంట్‌కు 50 మీటర్ల సీసీ రోడ్డు పనులు, పార్కింగ్ ప్రాంతంలో గ్రావెల్ నింపడం, సెప్టిక్ ట్యాంక్ నుంచి డ్రెయిన్ వరకు పైప్ డ్రెయిన్ (యూజీడీ) ఏర్పాటు, రూ. పది లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ కార్యాలయం) వద్ద పార్కింగ్ టైల్స్ వేయడం, ఫెన్సింగ్ ఏర్పాటు, రూ. 31 లక్షలతో జనగామ ఐడీఓసీ (కలెక్టరేట్ భవనం)కు ప్రహరీ గోడ నిర్మాణాల పనుల శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించి, శంకుస్థాపనలు చేశారు.
పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం:
-- విడతల వారీగా ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు.పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆ తర్వాత జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేదల గుమ్మానికి చేర్చే బాధ్యతతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
అదనంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు హాస్టళ్లలో డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను గణనీయంగా పెంచామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలను నిర్మిస్తున్నామని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వచ్చే దసరా నాటికి 2.18 లక్షల ఇళ్లు పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రతి నియోజకవర్గానికి సమానంగా 3,500 ఇళ్లు మంజూరు చేశామని, జనగామ నియోజకవర్గానికి కూడా అదే విధంగా ఇళ్లు ఇచ్చామని తెలిపారు. లబ్ధిదారులు నిర్మాణ పనులు చేసిన దశలను బట్టి ప్రతి సోమవారం వారి ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తున్నామని చెప్పారు.
రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇళ్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో పూరిగుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ముందుగా పూరిళ్లలో నివసిస్తున్న కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.
జనగామ నియోజకవర్గంలో గుర్తించిన 500 పూరిళ్ల కుటుంబాలకు ఈ వేదికపై నుంచే రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లు, మొండిగోడలతో ఉన్న ఇళ్లు, స్లాబ్ స్థాయిలో ఆగిపోయిన ఇళ్లను కూల్చకుండా పూర్తి చేసుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా రెండో విడతలో అమలు చేస్తున్నామని చెప్పారు.
మూడో విడత, నాలుగో విడతల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి* హామీ ఇచ్చారు. గతంలో సేకరించిన ప్రభుత్వ ఇళ్ల స్థలాలను గుర్తించి, అర్హులైన పేదలకు పంపిణీ చేసి, తదుపరి విడతల్లో అక్కడ కూడా ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.70 వేల కోట్లకు పైగా సున్నా వడ్డీ రుణాలు అందించామని చెప్పారు.
గతంలో నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి, లబ్ధిదారులకు అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. జనగామలో ఇందుకు అవసరమైన రూ.2 కోట్లను వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దసరా నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను నివాసయోగ్యంగా మార్చి అందిస్తామని తెలిపారు.
జనగామ మున్సిపాలిటీలో మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి విడతగా రూ.25 కోట్లు వెంటనే మంజూరు చేస్తామని, ఇప్పటికే శంకుస్థాపన చేసిన రూ.58–60 కోట్ల అభివృద్ధి పనులు, టెండర్లు పూర్తయిన రూ.19 కోట్ల పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.
రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తున్నామని, వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు.
నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 14–15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, అర్హులైన ఏ ఒక్క కుటుంబం కూడా ఇందిరమ్మ ఇల్లు విషయంలో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా ప్రతి అర్హ కుటుంబానికి ఇల్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి స్పష్టం చేశారు.అంతకు ముందు భువనగిరి పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకుందని, ఈ కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా అనేక కార్యక్రమాలను అమలు చేసిందన్నారు.
ప్రజాపాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఇంకా రాష్ట్రంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిష్కార దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అప్పుల భారం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిందని గుర్తు చేస్తూ, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అర్హులైన పేదలకే ఇళ్లు అందించాలన్నారు. అర్హత లేని వారు ఉంటే తొలగించి, నిజమైన అర్హులకు అవకాశం కల్పించాలన్నారు.
ఈ క్రమంలో జనగామ శాసనసభ్యులు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో జనగామ మున్సిపాలిటీ అత్యంత పురాతన మున్సిపాలిటీ అని పేర్కొంటూ, మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఏడు నెలల క్రితం జనగామ మున్సిపాలిటీ పరిధిలో రూ.18.90 కోట్ల అభివృద్ధి పనులు మంజూరై టెండర్లు పూర్తయ్యాయని, ఆ పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా వడ్లకొండ–శామీర్‌పేట్ బైపాస్ రోడ్డును డబుల్ లైన్ చేయాలని కోరారు. అలాగే చీటకోడూరు బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయాలని, గండిరామారం పంపులను మరమ్మతులు చేసి, వినియోగంలోకి తీసుకురావాలన్నారు.
అలాగే రెండో దశలో అదనంగా మరిన్ని ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేసి, అందించాలన్నారు.
అనంతరం జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ.. 2008 సంవత్సరం నుంచి తాగునీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చీటకోడూరు డ్యామ్ పరిసర ప్రాంతాల ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, ఆయా ప్రాంతాలకు మంచినీటి సరఫరాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.
జనగామ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, పలు వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఈ పనుల ద్వారా జనగామ మున్సిపాలిటీని అందరికీ ఆదర్శప్రాయమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
తదనంతరం 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు.
ఈ కార్యక్రమంలోమార్కెట్ కమిటీ ఛైర్మెన్ శివరాజ్ యాదవ్, వైస్ చైర్ మెన్ బూస్ పర్వతాలు,ఇతర అన్ని మండలాల ప్రజా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మహిళా ప్రతినిధులు అధికారులు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) బెన్హాలోమ్,ఆర్డీఓ గోపీరాం, మునిసిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, అన్ని మండలాల ఎంపిడిఓలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.