BREAKING
సుమలత విభజించి పాలిస్తున్నారు.. అందుకే యూనియన్‌లో సమస్యలు: రఘు మాస్టర్ సంచలన ఆరోపణలు అనకాపల్లిలో కూటమి సమన్వయ సమావేశంలో ఎన్నికలపై సుదీర్ఘ చర్చ...... నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు! గ్లోబల్ స్థాయిలో 'రామాయణం' ప్రమోషన్స్.. మిస్టర్ బీస్ట్‌తో మేకర్స్ మాస్టర్ ప్లాన్! విదేశీ ఉద్యోగం.. ఇక ప్రభుత్వ మార్గంలోనే..! నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై కేటీఆర్ ఆసక్తికర పోస్ట్.. టాలీవుడ్ అంచనాలు తారాస్థాయికి! ప్రయాణికులకు మరింత చేరువగా పోలీస్ సేవలు కొత్త హెయిర్‌స్టైల్‌తో అనసూయ రచ్చ.. తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ బ్యూటీ! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ.. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అప్‌డేట్ ఎప్పుడంటే! కీర్తి సురేశ్ 'డొరోతి' మూవీ వివాదం.. బోల్డ్ సీన్లు, ఎల్జీబీటీక్యూ కంటెంట్‌పై తీవ్ర విమర్శలు! ఉపాధ్యాయులే భావితరాలకు మార్గదర్శకులు సపల ఆర్గానిక్ సంస్థను సందర్శించిన సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు వీఆర్ఏల వినతిపత్రం వీఆర్ఏల వినతి పత్రం శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకాలు జక్కంపూడి రాజాను కలిసిన యువజన నేత

అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

Select Suryaa Now
అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

 

"ఉద్దెమర్రి శ్రీ విష్ణు శివాలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ"

శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 26):

మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దెమర్రి గ్రామంలోని శ్రీ అక్కన్న మాదన్న శ్రీ విష్ణు శివాలయంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ (ఏబీఏపీ) మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏబీఏపీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ కోశాధికారి రాయబారపు రవిరాజు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లెం రాజు, రాష్ట్ర కార్యదర్శి దూశెట్టి భాస్కర్, గౌరవ అధ్యక్షుడు సత్యం గురుస్వామి పాల్గొన్నారు.ముఖ్య అతిథులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ప్రతి శనివారం ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదానం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, అన్నదానం ద్వారా సేవాభావాన్ని పెంపొందించవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, ఆలయ భక్తులు, ఏబీఏపీ ట్రస్ట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రిపోర్టర్ టి.రవి గౌడ్